పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే వారు బాగా చదవాలని ప్రతి పేరెంట్స్ ఆశపడుతుంటారు. ఇందుకోసం పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రులు ఎక్కడా తగ్గరు. అడిగిందల్లా ఇప్పిస్తుంటారు. అయితే చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు బాగా చదవాలని, క్లాస్ ఫస్ట్ రావాలని ట్యూషన్ కు రెగ్యులర్ గా పంపిస్తుంటారు.
కొంతమంది ఎక్సామ్ లో పిల్లలకు మంచి మార్కులు రావాలని కూడా ట్యూషన్ కు పంపుతుంటారు. కానీ మీ పిల్లలు క్లాసులో ఫస్ట్ రావాలంటే వారిని స్కూలుకు పంపాల్సిన అవసరమేమీ లేదు. ఇంట్లో ఉండి కూడా మీ పిల్లలు క్లాస్ ఫస్ట్ వచ్చేలా చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
పిల్లల కోసం ప్రత్యేక టైమ్ టేబుల్
పిల్లలకు ఎక్కువ సేపు చదవాలనే ఇంట్రెస్ట్ అస్సలు ఉండదు. మీకు తెలుసా? రోజులో ఎక్కువ సేపు చదువు చెబితే చదువంటే వారికి విసుగు పుడుతుంది. దీంతో వారు చదువుకు దూరమవుతారు. దీని ప్రభావం పరీక్షల మార్కుల్లో మీకు స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే మీ పిల్లలకు చదువుపై ఆసక్తిని పెంచాలంటే మీరు ఒక కొత్త, డిఫరెంట్ టైం టేబుల్ ను వారికోసం తయారుచేయండి.
ఈ టైం టేబుల్ లో వారు ఆడుకోవడానికి లేదా వారిక ఇష్టమైన పనులు చేయడానికి సమయాన్ని కేటాయించండి. ఇలాంటి టైమ్ టేబుల్ ను చూసి మీ పిల్లలు అస్సలు బోర్ గా ఫీలవ్వరు. అలాగే ఇది వారికి చదువుపై ఇంట్రెస్ట్ ను పెంచుతుంది. వారు శ్రద్ధగా చదువుకోవడానికి సహాయపడుతుంది. అలాగే టైం టేబుల్ లో వారు రాసుకోవడానికి, చదవడానికి కూడా టైంను కేటాయించండి.
అనుకూలమైన వాతావరణం
కేవలం ప్రత్యేక టైమ్ టేబుల్ మాత్రమే మీ పిల్లలకు మంచి మార్కులు వచ్చేలా చేయదు. ఇందుకోసం మీరు మీ పిల్లలకు చదువుకోవడానికి మంచి వాతావరణాన్ని కల్పించాలి. దీనికోసం మీ ఇంట్లో సైలెంట్, మంచి సానుకూల ప్రదేశాన్ని సెలక్ట్ చేసుకోండి.
మీకు వీలైతే మీ పిల్లలు చదువుకోవడానికి ఒక ప్రత్యేక గదిని ఏర్పాటు చేయండి. అలాగే తగినంత వెంటిలేషన్ రూం ఉండేలా చూసుకోండి. అలాగే బయటివ్యవక్తులు కనిపించని రూంనే పిల్లలు చదువుకోవడానికి ఏర్పాటు చేయండి. దీంతో మీ పిల్లలు పూర్తి ఏకాగ్రతతో చదువుకుంటారు.
సోషల్ మీడియాను సరిగ్గా ఉపయోగించుకోవడం
ఈ కాలంలో పిల్లలు ట్యూషన్ కు వెళ్లి చదువుకోవడం లాంటివి చేయడం ఎప్పుడో ఆపేసారు. ఒకప్పుడు అయితే పరీక్షల్లో మంచి మార్కులు రావాలని ట్యూషన్లకు వెళ్లేవారు. కానీ ఇప్పుడు టీచర్ల వద్ద కూర్చోవాల్సిన అవసరం లేకుండా ప్రతీ విషయం సోషల్ మీడియాలో అందుబాటులో ఉంది.
ప్రతి సబ్జెక్టుకు సంబంధించిన సమాచారం దీనిలో వివిరంగా ఉంటుంది. సోషల్ మీడియా ఏ ప్రశ్నకైనా సమాదానం ఇస్తుంది. కాబట్టి మీ పిల్లల్ని ఫోన్ లో గేమ్స్, ఫన్నీ వీడియోలు కాకుండా.. చదువుకోమని చెప్పండి. అయితే మీ పిల్లలు ఫోన్ లో ఏం చదువుతున్నారో మాత్రం మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి.
ప్రేరణ కూడా ముఖ్యమే
పిల్లల చదువులైనా మరేదాంట్లోనైనా ప్రయత్నం చేస్తుంటే.. వారు చేసిన కృషిని తల్లిదండ్రులకు మీరు ఖచ్చితంగా అభినందించాలి, ఇలా చేయడం వల్ల మీ పిల్లల్లో మనోధైర్యం బాగా పెరుగుతుంది. దీంతో మీ పిల్లలు మరింత కష్టపడి పనిచేస్తారు. అనుకున్న దాంట్లో విజయం సాధిస్తారు.