అమరావతి : పల్నాడు జిల్లా దాచేపల్లిలో ఇటీవల పద్మశాలి కార్తీక వనభోజన కార్యక్రమంలో వైసిపి నేత గంజి చిరంజీవికి జరిగిన అవమానంపై పద్మశాలి సంఘం నాయకులు వివరణ ఇచ్చారు.
అమరావతి : పల్నాడు జిల్లా దాచేపల్లిలో ఇటీవల పద్మశాలి కార్తీక వనభోజన కార్యక్రమంలో వైసిపి నేత గంజి చిరంజీవికి జరిగిన అవమానంపై పద్మశాలి సంఘం నాయకులు వివరణ ఇచ్చారు. పిలవని పేరంటానికి వచ్చి చిరంజీవి రాజకీయాలు చేస్తున్నారంటూ ముస్యం శ్రీనివాస్ అవమానకరంగా మాట్లాడటం దారుణమన్నారు. తమ ఆహ్వానం మేరకే చిరంజీవి వనభోజన కార్యక్రమానికి హాజరయ్యారని అన్నారు. ముస్యం శ్రీనివాస్ మద్యంమత్తులో వేదికపైకి వచ్చి చిరంజీవి గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడినట్లు... ఆయన వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని దాచేపల్లి పద్మశాలి సంఘం నేతలు స్ఫష్టం చేసారు.