May 12, 2022, 5:30 PM IST
కాకినాడ: బంగాళాఖాతంలో ఏర్పడిన ఆసని తుఫాను ఏపీలో బీభత్సం సృష్టించింది. ఈ తుఫాను కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారి భారీ కెరటాలు తీరానికి ఎగసిపడుతున్నాయి. ఈ రాకాసి అలలు కాకినాడ సమీపంలోని ఉప్పాడ ప్రాంతంలో కనకవర్షం కురిపిస్తున్నాయట. సముద్ర అలల తాకిడి పెరగడంతో ఉప్పాడ తీరానికి బంగారం కొట్టుకువస్తోందని ప్రచారం జరుగుతోంది. దీంతో స్థానిక ప్రజల తీరానికి క్యూ కడుతున్నారు. జోరు గాలి, భారీ వర్షాన్ని, ఎగసిపడుతున్న అలలను సైతం లెక్కచేయకుండా బీచ్‌లో బంగారం కోసం వేటాడుతున్నారు. ముఖ్యంగా మత్స్యకారులకు వేటకు వెళ్లే అవకాశం లేకపోవడంతో ఇంట్లోని ఆడవాళ్లతో కలిసి బంగారు కోసం ఉప్పాడ తీరంతో తిష్టవేసారు.