Aug 4, 2022, 2:31 PM IST
జగ్గయ్యపేట : ఎన్టీఆర్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జగ్గయ్యపేటలోని బజాజ్ ఫైనాన్స్ షోరూం ఎదుట నిన్న(బుధవారం) రాత్రి కొందరు వ్యక్తులు అభిరామ్ అనే రికవరీ ఏజెంట్ ను పట్టుకుని చితకబాదారు. ఈ దాడి దృశ్యాలు ఫైనాన్స్ సంస్థ సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి. లోన్ డబ్బులు తిరిగి కట్టాలని అడిగినందుకే సత్యప్రసాద్ అనే వ్యక్తి మనుషులతో వచ్చి తనపై దాడికి పాల్పడినట్లు బాధిత రికవరీ ఏజెంట్ తెలిపాడు. మాదిగ నా కొడకా... మమ్మల్నే డబ్బులు కట్టమంటావా అంటూ దుర్భాషలాడుతూ తనపై దాడికి పాల్పడినట్లు అభిరామ్ తెలిపాడు.