Chaitanya Kiran | Published: Apr 20, 2023, 5:17 PM IST
అర్ధరాత్రి తుపాకుల మోతతో మానుకొండూరు ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఓ క్రిమినల్ పై గుర్తుతెలియని దుండగుల ముఠా గన్ తో కాల్పులకు తెగబడటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. మానుకొండూరు పట్టణంలో నివాసముండే అరుణ్ కుమార్ పాత నేరస్తుడు. అనేక నేరాలకు పాల్పడిన ఇతడిపై పిడి యాక్ట్ వుంది. అయితే గత అర్ధరాత్రి గుర్తుతెలియని క్రిమినల్స్ ముఠా అరుణ్ ను చంపేందుకు ప్రయత్నించింది. తుపాకులతో మానుకొండూరు చేరుకున్న ముఠాసభ్యులు అర్దరాత్రి అరుణ్ పై కాల్పులకు తెగబడ్డారు.