Jan 25, 2022, 3:37 PM IST
విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా థర్డ్ వేవ్ కోరలు చాస్తోంది. రోజుకు పదిహేనువేల పైచిలుకు కేసులు నమోదవుతూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. సంక్రాంతి పండగ తర్వాత కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగింది. ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు ఇవ్వకుండా నడిపిస్తుండటంతో విద్యార్థులు కరోనా బారిన పడుతున్నారు. ఇలా కృష్ణా జిల్లా విజయవాడలోని వాంబే కాలనీ ఎలిమెంటరీ స్కూల్లో కరోన కలకలం రేగింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే మున్సిపల్ సిబ్బందితో స్కూల్ రూమ్స్ లో శానిటేషన్ చేయించారు.