ఇళ్ల స్థలాల విషయంలో వైసిపి వర్గాల ఘర్షణ... నలుగురికి గాయాలు

Dec 29, 2020, 12:33 PM IST

కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పేరకలపాడు గ్రామంలో ఇళ్ల స్థలాల విషయంలో వైసిపి వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ గొడవలో నలుగురికి గాయపడగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది. గాయపడినవారందరినీ చికిత్స నిమిత్తం నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.