Video:భార్యను కాపురానికి పంపించమని అడిగినందుకు..

Nov 26, 2019, 12:04 PM IST

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం , శ్రీనివాసపురం గ్రామంలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఇరు వర్గాలుకర్రలు, గొడ్డలితో దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఇరు కుటుంబాలకు చెందిన ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. రామకృష్ట అనే వ్యక్తి తన భార్యను కాపురానికి 
పంపించమని అడిగే క్రమంలో ఈ వివాదం చెలరేగింది.