Jul 27, 2020, 4:09 PM IST
విశాఖపట్నం ఎన్.ఏ.డి ఫ్లైఓవర్ పనులను మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాసరావు, ఎంపీ ఎం.వి.వి..సత్యనారాయణలు పరిశీలించారు. రేపటి నుంచి ఎయిర్ పోర్ట్ విశాఖ సిటీ మధ్య ఫ్లైఓవర్ మీదుగా వాహనాల రాకపోకలకు అనుమతులు మంజూరు చేశారు. ఆగస్టు 15 నుంచి మర్రిపాలెం నుంచి గోపాలపట్నం వైపు ఫ్లై ఓవర్ మీదుగా వాహనాల రాకపోకలు ప్రారంభం అవ్వనున్నాయి. దీంతో విశాఖ సిటీ లో ఇక ట్రాఫిక్ కష్టాలు తీరినట్లేనని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.