జీవితంలో విజయం సాధించాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది. అయితే, అలాంటివారు కచ్చితంగా చాణక్య నీతిని పాటించాల్సిందేనట. మరి, చాణక్యుడి ప్రకారం విజయం సాధించడానికి ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం...
అర్థశాస్త్ర రచయిత చాణక్యుడు.. మన జీవితంలో అవసరమైన చాలా విషయాలను ఎప్పుడో వివరించారు. వివాహం, సమాజం, ఆర్థిక వ్యవస్థ, ప్రేమ వంటి వివిధ విలువైన విషయాలపై తన అభిప్రాయాలను ఆయన వివరించారు
25
చాణక్య నీతి ప్రకారం, జీవితంలో విజయవంతం కావాలంటే ఎల్లప్పుడూ మూడు విషయాల గురించి జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఏ రంగంలోనూ విజయం సాధించలేము. మరి, ఎలాంటి వాటికి దూరంగా ఉండాలో చూద్దాం..
35
చాణక్య నీతి ప్రకారం, జీవితంలోని మూడు విషయాలలో జాగ్రత్తగా లేకపోతే ప్రమాదం ముంచుకొస్తుంది. అగ్ని, ప్రభావవంతమైన వ్యక్తులు , స్త్రీల గురించి ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ దూరం ఉంచడం మంచిది కాదు, అలాగే ఎక్కువ సాన్నిహిత్యం కూడా మంచిది కాదు.
45
చాణక్య నీతి ప్రకారం, అగ్ని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అగ్నికి చాలా దగ్గరగా వెళ్లకూడదు, అలాగే అగ్నికి చాలా దూరంగా ఉండకూడదు. అగ్ని నుండి సురక్షితమైన దూరం ఉంచాలి. అంతేకాదు.. ప్రభావవంతమైన వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వారితో శత్రుత్వం లేదా స్నేహం, రెండూ మంచివి కావు.
55
చాణక్య నీతి ప్రకారం, స్త్రీలతో సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలతో ఎక్కువ సమయం గడిపితే ఇబ్బందుల్లో పడవచ్చు. అలా అని పూర్తిగా స్త్రీలకు దూరంగా ఉండటం కూడా అంత మంచిది కాదు. కాబట్టి.. ఎంత వరకు ఉండాలో అంత వరకు మాత్రమే ఉండాలట.