ఇడియట్, ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, అమ్మానాన్నా ఓ తమిళ అమ్మాయి, ఖడ్గం వంటి సినిమాలు రవితేజను హీరోగా నిలబెట్టాయి. విక్రమార్కుడు, కిక్ చిత్రాలు భారీ విజయాలు నమోదు చేశాయి. రవితేజ స్టార్ హీరోగా సెటిల్ అయ్యారు. రవితేజ సిల్వర్ స్క్రీన్ పై ఎనర్జిటిక్ గా ఉంటారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, కామెడీ టైమింగ్ చాలా ప్రత్యేకం. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆయన కెరీర్ పరుగులు పెడుతుంది.