ఉపాధి హామీ పనుల్లో అవకతవకలపై కేంద్రం సీరియస్... రంగంలోకి ప్రత్యేక బృందం

Jan 19, 2022, 5:17 PM IST

నూజివీడు: కృష్ణా జిల్లాలో ఉపాధి హామీ పనుల్లో భారీ అవకతవకలు జరిగాయన్న ఆరోపణలను కేంద్రం సీరియస్ గా తీసుకుంది. ఈ క్రమంలోనే నూజివీడు నియోజకవర్గ పరిధిలోని ముసునూరు మండలంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను కేంద్ర బృందం పరిశీలించింది. ముసునూరు ఎంపిడిఓ కార్యాలయంలో కేంద్ర  బృందం తనిఖీ చేపట్టింది. మండల పరిధిలోని 16 గ్రామాల్లో జరిగిన ఉపాధిహామీ పనులకు సంబంధించిన రికార్డులను  కేంద్ర బృందం సభ్యులు పరిశీలించారు.మండలంలోని పలు గ్రామాల్లో మొక్కలు నాటడం, రహదారి అభివృద్ధి పనుల్లో అవకతవకలు జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్న నేపథ్యంలో కేంద్ర బృందం తనిఖీలు ప్రాధాన్యత సంతరించుకుంది.