వాగులో కొట్టుకుపోయిన కారు.. చెట్టుకొమ్మకు చిక్కుకున్న జంట.. (వీడియో)

Oct 13, 2020, 4:53 PM IST

రెండు రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా గన్నవరం మెట్ట వద్ద దొంగ గెడ్డ ఉదృతంగా ప్రవహిస్తోంది. ఈ తెల్లవారుజామున కారులో నర్సీపట్నం నుంచి తిరుపతి బయలుదేరిన నలుగురు వ్యక్తులు గెడ్డ దాటుతుండగా ప్రమాదవశాత్తు కారు కొట్టుకుపోయింది. కారులోనుండి బయటపడ్డ దంపతులు చెట్టుకొమ్మలు పట్టుకొని వేలాడుతున్నారు. మరో మహిళ కారులోనే చిక్కుకుపోయింది. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు.