test cricket records-india : ప్రపంచ క్రికెట్ లో భారత ప్లేయర్లు సత్తా చాటుతున్నారు. భారత క్రికెటర్లు ఇప్పటికే అనేక రికార్డులు సృష్టించారు. వాటిలో అత్యధిక సెంచరీలు, అత్యధిక పరుగులు, అత్యధిక మ్యాచ్ లు, డబుల్ సెంచరీలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే రికార్డులు ఉన్నాయి. ఇక టెస్టు క్రికెట్ ఫార్మాట్‌లో సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌లు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు.
అయితే, ప్రపంచంలో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన రికార్డు మాత్రం భారత లెజెండరీ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. టెండూల్కర్ తన కెరీర్ లో 100 సెంచరీలు చేశాడు. టెస్టుల్లో 51 సెంచరీలు సాధించాడు. అదే వన్డేల విషయానికి వస్తే 49 సెంచరీలు కొట్టాడు. టెస్టుల్లో సెంచరీలు కొట్టడం సాధారణమే కానీ..
ఒకే మ్యాచ్ లో డబుల్ సెంచరీ, సెంచరీ
ఒక టెస్టు మ్యాచ్ లో సెంచరీలు చేయడం సాధారణంగా కనిపిస్తూనే ఉంటుంది. ఇలా చాలా మంది సెంచరీలు కొట్టాడు. అయితే ఒకే మ్యాచ్‌లో డబుల్ సెంచరీ, సెంచరీ కొట్టిన బ్యాట్స్‌మెన్ గురించి విన్నారా? అవును, ఇది జరిగింది. చాలా అరుదైన ఈ ఫీట్ ను ఒక భారత క్రికెట్ కూడా సాధించాడు.
టెస్టు మ్యాచ్‌లో డబుల్ సెంచరీ, సెంచరీ సాధించిన ఘనత ప్రపంచంలో కేవలం బ్యాట్స్‌మెన్‌లు 8 మంది ప్లేయర్లు మాత్రమే సాధించాడు. ఇందులో ఒక భారతీయ క్రికెట్ కూడా ఉన్నారు. కానీ, మీరు అనుకుంటున్నట్టుగా సచిన్ టెండూల్కర్ గానీ, విరాట్ కోహ్లీ గానీ ఈ రికార్డును సాధించలేదు.
వీరు కాకపోతే టెస్టులో అదరగొట్టిన ది గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ రాహుల్ ద్రావిడ్ కూడా కాదు. టెస్టుల్లో కంగారులను కంగారెత్తించిన వీవీఎస్ లక్ష్మణ్ అనుకున్నా అతను కూడా కాదు.
Sunil Gavaskar
ఒకే టెస్టు మ్యాచ్‌లో డబుల్ సెంచరీ, సెంచరీ సాధించిన భారత ప్లేయర్ ఎవరు?
ఒకే టెస్టు మ్యాచ్‌లో డబుల్ సెంచరీ, సెంచరీ సాధించిన ఏకైక భారత ఆటగాడు సునీల్ గవాస్కర్. 10,000 టెస్టు పరుగులు పూర్తి చేసిన ఈ లెజెండ్ 1971లో వెస్టిండీస్‌పై ఈ ఘనత సాధించాడు. గవాస్కర్ ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 124 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 220 పరుగులు చేశాడు. ఆ సమయంలో, గవాస్కర్ ఈ అద్భుతం చేసిన ప్రపంచంలో రెండవ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
గవాస్కర్ ఫీట్‌కు రెండేళ్ల ముందు, అంటే 1969లో, ఆస్ట్రేలియా లెజెండ్ డగ్ వాల్టర్స్ కూడా ఒకే మ్యాచ్ లో సెంచరీ, డబుల్ సెంచరీ కొట్టాడు. అతను వెస్టిండీస్‌పై తొలి ఇన్నింగ్స్‌లో 242 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 103 పరుగులు సాధించాడు. దీంతో ఈ ఘనత సాధించి తొలి ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు.
యాక్టివ్ ప్లేయర్‌లో ఒకరు మాత్రమే ఉన్నారు
టెస్టు మ్యాచ్‌లో డబుల్ సెంచరీ, సెంచరీ సాధించిన ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న వారిలో ఒకే ఒక్క ప్లేయర్ ఉన్నారు. అతనే ఆస్ట్రేలియాకు చెందిన స్టార్ బ్యాటర్ మార్నస్ లాబుషాగ్నే. ఆస్ట్రేలియాకు చెందిన ఈ టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ 2022లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో డబుల్ సెంచరీ, సెంచరీ సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 204 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 104 పరుగులతో అజేయంగా నిలిచాడు.
వీరితో పాటు, లారెన్స్ రోవ్ (వర్సెస్ న్యూజిలాండ్ - 214, 100*), గ్రెగ్ చాపెల్ (వర్సెస్ న్యూజిలాండ్ - 247*, 133), గ్రాహం గూచ్ (వర్సెస్ ఇండియా - 333, 123), బ్రియాన్ లారా (వర్సెస్ శ్రీలంక - 221, 130), కుమార్ సంగక్కర (వర్సెస్ బంగ్లాదేశ్ - 319, 105) కూడా ఒకే టెస్టు మ్యాచ్ లో డబుల్ సెంచరీ, సెంచరీ సాధించిన వారి లిస్టులో ఉన్నారు.
ప్రపంచంలోని గొప్ప బ్యాట్స్‌మెన్ లలో ఒకరు సునీల్ గవాస్కర్
సునీల్ గవాస్కర్ ప్రపంచంలోని గొప్ప బ్యాట్స్‌మెన్‌లలో ఒకరు. తన 125 మ్యాచ్‌ల సుదీర్ఘ టెస్ట్ కెరీర్‌లో10122 పరుగులు చేశాడు. ఇందులో 34 సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. తన కెరీర్ లో సునీల్ గవాస్కర్ ఎన్నో రికార్డులు కూడా తన పేరిట లిఖించుకున్నాడు.
ఇప్పటివరకు అతని రికార్డులను బ్రేక్ చేయలేని వాటిలో భారత కెప్టెన్‌గా టెస్టు సిరీస్‌లో అత్యధికంగా 732 పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అలాగే, టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 5000 పరుగులు పూర్తి చేసిన భారతీయ ప్లేయర్ కూడా సునీల్ గవాస్కర్. భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన మూడో బ్యాట్స్‌మెన్‌గా కూడా నిలిచాడు.