ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో మాస్ చిత్రాలు ఇండస్ట్రీని ఏలుతున్న సమయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆది చిత్రంలో నటించారు. అప్పటి వరకు ఫ్యాక్షన్ మూవీస్ అంటే బాలయ్య పేరు వినిపించేది. ఆది చిత్రం తర్వాత నందమూరి వంశానికి సరైన వారసుడు అంటూ తారక్ పేరు మారుమోగింది. సింహాద్రి చిత్రం ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ కాదు కానీ ఇండస్ట్రీ రికార్డులని తిరగరాసింది.
ఆ తర్వాతే ఎన్టీఆర్ కి అసలు పరీక్ష మొదలైంది. ఫ్యాక్షన్ చిత్రాలు తీయడంలో డైరెక్టర్ బి గోపాల్ స్పెషలిస్ట్. నందమూరి బాలకృష్ణకి బి గోపాల్ సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు లాంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాలని ఇచ్చారు. అంతకు ముందు లారీ డ్రైవర్ లాంటి హిట్ చిత్రం కూడా వీరి కాంబినేషన్ లో వచ్చిందే.
బాలయ్యకి వరుస బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన బి గోపాల్.. ఎన్టీఆర్ తో మాత్రం డిజాస్టర్ చిత్రాలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్, బి గోపాల్ కాంబినేషన్ వర్కౌట్ కాలేదు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అల్లరి రాముడు, నరసింహుడు చిత్రాలు నిరాశ పరిచాయి. అల్లరి రాముడు కొంతవరకు ఒకే. సెకండ్ హాఫ్ పూర్తిగా దెబ్బ తినింది అని బి గోపాల్ అన్నారు.
నగ్మ నడుము సన్నివేశంపై బి గోపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్.. నగ్మ నడుముపైకి ఎక్కడం లాంటి సన్నివేశాలు బాగా నవ్వించాయి. ఆకు చాటు పిందె తడిచె సాంగ్ రీమిక్స్ కూడా బాగా ఆకట్టుకుంది. ఫస్ట్ హాఫ్ అంతా బావుంటుంది. కానీ సెకండ్ హాఫ్ కొంత డ్యామేజ్ జరిగింది అని బి గోపాల్ అన్నారు. అదే సమయంలో ఇంద్ర చిత్రం కూడా రిలీజ్ కావడంతో అల్లరి రాముడు చిత్రానికి వసూళ్లు రాలేదు అని తెలిపారు.
ఇక నరసింహుడు చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నరసింహుడు చిత్రంలో ఎలాంటి పాజిటివ్ అంశం లేదు. అది స్టోరీ మొత్తం రాంగ్ అని బి గోపాల్ ఒప్పుకున్నారు. బాలయ్యకి వరుస హిట్లు ఇచ్చిన తాను..ఎన్టీఆర్ తో మాత్రం హిట్ సినిమా చేయలేకపోయానని అన్నారు.