ఏపీలో బిఆర్ఎస్ జోరు... సంక్రాంతికి కేసీఆర్ నిలువెత్తు ఫోటోలతో భారీ ప్లెక్సీలు

Jan 15, 2023, 2:06 PM IST

అమరావతి : జాతీయ రాజకీయాలకు శ్రీకారం చుడుతూ టీఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చిన కేసీఆర్ ముందు ఇంటగెలిచే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తెలంగాణలో అల్రెడీ బలంగా వున్న బిఆర్ఎస్ ను ఏపీలో బలోపేతం చేసేందుకు యత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే తోట చంద్రశేఖర్ ను ఏపీ బిఆర్ఎస్ అధ్యక్షుడిగా నియమించడంతో పాటు ఈ సంక్రాంతి పండగవేళ ప్రజలకు పార్టీని దగ్గరచేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీలోని పలు జిల్లాలు, పట్టణాలు, ప్రధాన కూడళ్లు, హైవేల పక్కన కేసీఆర్, కేటీఆర్ ఫోటోలతో ఏపీ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ భారీ ప్లెక్సీలు వెలిసాయి. ఈ ప్లెక్సీలు ఏపీ రాజకీయాల్లోనే కాదు ప్రజల్లోనూ చర్చకు దారితీసాయి.