మీరు నెలకు రూ.60,000 పెన్షన్ పొందాలంటే ఇలా చేయండి

First Published | Sep 22, 2024, 10:52 PM IST

రిటైర్మెంట్ తర్వాత డబ్బుకు ఇబ్బంది పడకూడదని మనలో చాలా మంది ఇప్పటి నుంచే అనేక స్కీమ్ లలో పొదుపు చేస్తుంటారు. ఇండియన్ పోస్టల్ శాఖ నిర్వహిస్తున్న అనేక పథకాల్లో ఒకటైన పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్( PPF) పెన్షన్ పథకంలో చేరి డబ్బులు కడితే మీరు రిటైర్మెంట్ తర్వాత సుమారు రూ.60 వేల వరకు పెన్షన్ పొందొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 

పోస్టల్ శాఖ నిర్వహిస్తున్న చిన్న పొదుపు పథకాలలో ఒకటైన పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ చాలా ఫేమస్. దీన్ని పెన్షన్ పథకం అని కూడా పిలుస్తారు. ఈ పథకం గడువు 15 సంవత్సరాలు. కాబట్టి చాలా మంది ఇందులో పెట్టుబడి పెడతారు. దీని ద్వారా తమ పదవీ విరమణ నిధిని సేకరించవచ్చు. PPF నిబంధనలను జాగ్రత్తగా చదివి, ఆ నిబంధనల ప్రకారం స్మార్ట్‌గా పెట్టుబడి పెడితే పదవీ విరమణ తర్వాత పన్ను రహిత పెన్షన్ పొందవచ్చు.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ గడువు 15 సంవత్సరాలు. అయితే ప్రతి 5 సంవత్సరాల ఒకసారి పొడిగించుకోవడానికి అవకాశం ఉంది. అంటే 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఈ పథకాన్ని కొనసాగించవచ్చు. ఇందులో డిపాజిట్ చేసిన మొత్తాన్ని 5 సంవత్సరాలు ఎక్స్‌టెండ్  చేసినప్పుడు ఆ సమయంలో ఉన్న వడ్డీ రేటు ఎంతో అది నిరంతరం లభిస్తుంది. అయితే పథకాన్ని 5 సంవత్సరాలు పొడిగించి ఇంతకు ముందులాగే పెట్టుబడి పెడితే ఇప్పటికే లభిస్తున్న వడ్డీ రేటు కంటిన్యూగా వస్తుంది. ప్రస్తుతం ఈ పథకం వడ్డీ రేటు సంవత్సరానికి 7.1 శాతం ఉంది. 

Latest Videos


15 సంవత్సరాలు మీరు ఈ స్కీమ్ లో డబ్బు కట్టారు. స్కీమ్ గడువు ముగిసింది. ఇప్పుడు మీరు డబ్బును తీసేయకుండా 5 సంవత్సరాల పాటు పొడిగిస్తే మీరు రెండు రకాల బెనిఫిట్స్ పొందవచ్చు. ఒకటి ఏ పెట్టుబడి పెట్టకుండా పథకాన్ని పొడిగించడం, పొడిగించిన 5 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం లభించిన డబ్బును మొత్తాన్ని తీసుకోవచ్చు. మరొక అవకాశంలో పొడిగించిన కాలంలో మునుపటిలాగే నిరంతరం పెట్టుబడి పెడుతూ ఉంటే ప్రతి సంవత్సరం 60 శాతం వరకు డబ్బును వెనక్కు తీసుకోవచ్చు. 

35 సంవత్సరాల వయస్సులో మీరు PPF ఖాతాలో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే 15 సంవత్సరాల స్కీమ్ గడువు తర్వాత కూడా ఈ పథకాన్ని 10 సంవత్సరాల పాటు పొడిగించుకునే అవకాశం మీకు ఉంటుంది. అంటే మీకు 60 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఈ పథకంలో 25 సంవత్సరాలుగా కొనసాగవచ్చు.

ఒక ఫైనాన్సియల్ ఇయర్ లో మాక్సిమం రూ.1.50 లక్షల వరకు మీరు PPF ఖాతాలో డిపాజిట్ చేయవచ్చు. ఈ విధంగా ప్రతి సంవత్సరం రూ.1.50 లక్షలు డిపాజిట్ చేస్తే 7.1 శాతం వడ్డీ రేటుతో 15 సంవత్సరాల కాల వ్యవధిలో రూ .40,68,209 మొత్తం వస్తుంది. దీన్ని మరో 5-5 సంవత్సరాలు అంటే తదుపరి 10 సంవత్సరాలు ఈ విధంగా నిరంతరం పెట్టుబడి పెడితే 25 సంవత్సరాల తర్వాత కోటి రూపాయలు అవుతుంది.

మీరు 25 సంవత్సరాలు ఇబ్బందులు లేకుండా పెట్టుబడి పెడితే స్కీమ్ గడువు ముగిసే సమయానికి వయస్సు 60 సంవత్సరాలు అయి ఉంటుంది. ఉద్యోగం నుండి పదవీ విరమణ పొందిన సందర్భంలో అదనంగా ఎటువంటి పెట్టుబడి పెట్టకుండానే PPF ఖాతాను మరో 5 సంవత్సరాల పాటు పొడిగించుకోవచ్చు. ఖాతాలో ఉన్న కోటి రూపాయల నిధికి వడ్డీ ప్రతి నెలా లభిస్తుంది. ప్రస్తుత వడ్డీ రేటు 7.1 శాతం. కాబట్టి ప్రతి సంవత్సరం రూ.7,31,300 వడ్డీ లభిస్తుంది.

ఏమీ పెట్టుబడి పెట్టకుండా ఖాతాను కొనసాగిస్తే పొడిగించిన 5 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం మొత్తం నిధిని తీసుకోవచ్చు. వడ్డీ డబ్బును మాత్రమే తీసుకోవాలనుకుంటే ప్రతి సంవత్సరం రూ.7,31,300 తీసుకోవచ్చు. అంటే నెలకు రూ. 60,917 లభిస్తుంది. ఈ ఆదాయానికి ఆదాయపు పన్ను కూడా కట్టాల్సిన అవసరం లేదు. 

click me!