గిన్నిస్ రికార్డ్ ని తాను ఊహించలేదని చిరంజీవి అన్నారు. దీనికి కారణం తన దర్శక నిర్మాతలు, అభిమానులు అని చిరంజీవి తెలిపారు. డ్యాన్స్ పై తనకి ఉన్న ఆసక్తే గిన్నిస్ రికార్డ్ వచ్చేలా చేసింది అని చిరంజీవి తెలిపారు.ఈ ఈవెంట్ ఇంత గ్లామర్‌గా, మెమరబుల్‌గా ఉండటానికి కారణం నా మిత్రుడు ఆమీర్‌ఖాన్. ఒక చిన్న మెసేజ్, ఫోన్ కాల్‌తో ఆయన ఇక్కడకు వచ్చినందుకు ధన్యవాదాలు. నా చిన్నప్పుడు మా చుట్టుపక్కల ఉన్నవారిని ఎంటర్‌టైన్ చేయడానికి నేను డ్యాన్సులు చేసేవాడిని. అప్పట్లో సాయంత్రం అయ్యే సరికి వివిధభారతిగానీ, రేడియో సిలోన్‌లోగానీ రకరకాల తెలుగు పాటలకి నేను డ్యాన్సులు చేసేవాడిని. అప్పట్లో గ్రామ్‌ఫోన్‌లు, టేప్‌రికార్డులు లేవు. అందుకే ఈ రేడియోల్లో పాటలు రాగానే, `శంకర్‌బాబుని పిలవండి.. డ్యాన్సులు వేస్తాడు అలరిస్తాడు.. అని అందరూ అనేవారు. వారి ఉత్సాహం చూసి నేను మరింత ప్రోత్సహం పొంది డ్యాన్సులు వేసేవాడిని.