రాజధాని గ్రామాల్లో బిజెపి ఎంపీ జివిఎల్ పర్యటన... అమరావతిపై కీలక వ్యాఖ్యలు

May 14, 2022, 5:30 PM IST

గుంటూరు: బిజెపి రాజ్యసభ సభ్యులు జీవిఎస్ నరసింహారావు రాజధాని అమరావతి గ్రామాల్లో పర్యటించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని రాజధాని గ్రామాల్లో పర్యటనకు విచ్చేసిన జివిఎల్ కు స్థానిక ప్రజలు, రైతులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా అక్కడ రైతుల కలిసి పలు ప్రాంతాలను పరిశీలించారు. గతంలో తమకు జరుగుతున్న అన్యాయం గురించి రాజధాని ప్రాంత రైతులు జివిఎల్ కు వివరించగా రాజధాని ప్రాంతంలో పర్యటిస్తానని వారికి హామీ ఇచ్చారు... ఈ క్రమంలోనే  తాజాగా రాజధాని గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా రాజధాని రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మూడు రాజధానులు సాధ్యం కాదని తెలుసు కాబట్టే రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లడం లేదని... అమరావతి రైతులెవ్వరూ రాజధాని గురించి భయపడొద్దని భరోసా ఇచ్చారు. ఎంపీతో పాటు బిజెపి రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం, గుంటూరు జిల్లా బిజెపి నాయకులు రాజధాని గ్రామాల్లో పర్యటించారు.