Atmakur bypoll 2022 : భారీ విజయం దిశగా దూసుకుపోతున్న వైసిపి... కొనసాగుతున్న కౌంటింగ్

Jun 26, 2022, 12:05 PM IST

నెల్లూరు: వైసిపి ఎమ్మెల్యే మేకపాట గౌతమ్ రెడ్డి మృతితో ఖాళీఅయిన ఆత్మకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే స్థానానికి ఉపఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల పోలింగ్ ముగియగా ఇవాళ (ఆదివారం) ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోనసాగుతోంది.  ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం వైసిపి అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి భారీ ఆధిక్యం దిశగా దూసుకెళుతున్నారు. ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం టిడిపి ఫోటీకి దూరంగా వుండగా బిజెపి నుండి  భరత్ కుమార్ పోటీచేసారు. అలాగే మరో 12మంది కూడా ఈ ఉప ఎన్నికలో పోటీచేసారు. 

ప్రస్తుతం ఆంధ్రా ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. కౌంటింగ్ ప్రశాంతంగా జరిపేందుకు అధికారులు, పోలీసులు భారీ ఏర్పాట్లు చేసారు. 14 టేబుళ్ళు, 20 రౌండ్స్ ద్వారా ఓట్ల లెక్కింపు జరుగుతోంది. అధికార వైసిపి ఈ ఉపఎన్నికలో 70 వేల వరకూ మెజారిటీ రావచ్చని అంచనా వేస్తోంది. ఫలితాలు కూడా అలాగే వస్తున్నాయి.