Aug 1, 2020, 2:55 PM IST
మూడు రాజధానులకు గవర్నర్ ఆమోదం తెలపడం మీద టీడీపీ నేత, విజయనగరం జిల్లా మాజీ పార్లమెంట్ శాసనసభ్యులు అశోక్ గజపతి రాజు తీవ్రంగా ఖండించారు. మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అంటూ చెప్పుకొచ్చారు. ప్రజల్ని మోసం చేయడం అవుతుందని అన్నారు. దీనివల్ల పెట్టుబడులు రావని రాష్ట్రం చాలా నష్టపోతుందని విరుచుకుపడ్డారు.