Jan 25, 2022, 12:22 PM IST
ఇవాళ మధ్యాహ్నం మంత్రుల కమిటీ చర్చలకు ఆహ్వానించిన నేపథ్యంలో పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ భేటీ అయ్యింది. సోమవారం మంత్రుల కమిటీతో చర్చలకు ఉద్యోగ సంఘాలు దూరంగా వుండటంతో ఇవాళ మరోసారి చర్చలకు ఆహ్వానించారు. ఈ క్రమంలోనే మంత్రుల కమిటీతో చర్చలకు హాజరుకావాలా, వద్దా అన్నది తేల్చేందుకు స్టీరింగ్ కమిటీ సమావేశమయ్యింది. భేటీ తర్వాత ఉద్యోగ సంఘాల నుండి మంత్రుల కమిటీతో భేటీపై స్పష్టత రానుంది.