ఆర్నెళ్లు కూడా పార్టీని సరిగా నడపలేక చేతులెత్తేశాడు...అనిల్ కుమార్ ఎద్దేవా...

Jan 17, 2020, 5:26 PM IST

జనసేన నేత పవన్ బీజేపీలో కలవడంపై ఏపీ జలవనరుల శాఖామంత్రి అనిల్ కుమార్ ఎద్దేవా చేశాడు. ఆర్నెల్లు కూడా పార్టీ ని నడపలేక పవన్ చేతులెత్తేశారన్నారు. చెగువీరా, పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వామపక్ష భావజాలం పేరుతో జనసేన పార్టీ పెట్టి అందుకు భిన్నమైన వారితో పవన్ చేతులు కలిపాడన్నారు. ఎన్నికలకు ముందే పవన్ టిడిపికి దత్తపుత్రుడుగా మారాడు.ఎన్నికల్లో చిత్తుగా ఓడి, ఉన్నఒక్కసీటు కూడా నిలుపుకోలేని పవన్ లాంటి వాళ్ళను జనం ఎప్పటికీ నమ్మరు అన్నారు. పవన్ ఎందరితో కలిసి గుంపుగా వచ్చినా సింహంలాగా జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా వస్తారని, జగన్మోహన్ రెడ్డిని ఏమీ పీకలేరని అన్నారు.