మాజీ హోంమంత్రి సుచరిత ఇంట్లో గన్ ఫైరింగ్... డ్రైవర్ ఆత్మహత్య

Jan 24, 2023, 11:32 AM IST

గుంటూరు :  ఆంధ్ర ప్రదేశ్ మాజీ హోంమంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత ఇంట్లో ఓ వ్యక్తి ఆత్మహత్య కలకలం రేపింది. సుచరిత కారు డ్రైవర్ చెన్నకేశవ రెడ్డి తుపాకీతో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు. గన్ ఫైరింగ్ శబ్దం విని కంగారుపడిన సుచరిత కుటుంబసభ్యులు, భద్రతాసిబ్బంది వెళ్లిచూడగా డ్రైవర్ రక్తపుమడుగులో పడివున్నాడు. వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా జిల్లా ఆరిఫ్ హఫీజ్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సుచరిత డ్రైవర్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి వుంది.