Oct 6, 2022, 3:34 PM IST
అమరావతి : రాష్ట్ర ఆదాయాన్ని మరింత పెంచుకోవడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టిసారించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చుతున్న శాఖలపై ఇవాళ(గురువారం) సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి ఎక్సైజ్ మంత్రి నారాయణ స్వామి, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గోన్నారు.