Jan 13, 2023, 1:23 PM IST
మచిలీపట్నం : మాజీ మంత్రి, పెనమలూరు వైసిపి ఎమ్మెల్యే కేపి పార్థసారధి ఇంటి విషాదం నెలకొంది. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పార్థసారధి తండ్రి, మాజీ ఎంపి కెపి రెడ్డయ్య యాదవ్ శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. విజయవాడలోని పార్ధసారధి ఇంటికి వెళ్లి రెడ్డయ్య బౌతికకాయానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం బాధలో వున్న పార్థసారధి కుటుంబాన్ని ఓదార్చారు.