Jul 28, 2020, 5:46 PM IST
ఆంధ్రప్రదేశ్ లో గంటా శ్రీనివాసరావు గురించిన చర్చ ఇప్పుడు తీవ్ర స్థాయిలో నడుస్తుంది. ఆయన పార్టీలో చేరతారని జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఊహాగానాల మాట అటుంచితే.... ఉత్తరాంధ్ర ఇంచార్జి గా వ్యవహరిస్తోంది జగన్ ఆత్మ విజయసాయి రెడ్డి. విశాఖకే చెందిన మరో బలమైన నాయకుడు అవంతి శ్రీనివాసరావు. వీరిని కాదని ఎవరి ద్వారా జగన్ దగ్గర గంటా చక్రం తిప్పాడనే విషయం ఆసక్తిని రేకెత్తిస్తోంది.