Mar 14, 2022, 12:29 PM IST
అమరావతి: ఇవాళ(సోమవారం) జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు శుభాకాంక్షలు తెలిపారు. ''ప్రజా సమస్యల పరిష్కారమే ద్యేయంగా పురుడుపోసుకుని... రాష్ట్ర రాజకీయాల్లో నిర్మాణాత్మక శక్తిగా అవతరించిన తమ మిత్రపక్షం జనసేనకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మంగళగిరిలో జనసేన నిర్వహించ తలపెట్టిన ఆవిర్భావ సభ వైభవోపేతంగా జరగాలని మనస్పూర్తిగా కోరకుంటున్నాను'' అంటూ సోము వీర్రాజు ఓ వీడియోను విడుదల చేసారు.