నెల్లూరులో అద్భుతం.. ఇసుకలో బయటపడ్డ 200యేళ్ల పురాతన ఆలయం..

Jun 17, 2020, 3:01 PM IST

నెల్లూరు జిల్లాలో 200ఏళ్ల పురాతన నాగేశ్వరాలయం బయటపడింది. ఇసుకలో గ్రామస్థులు తవ్వకాలు జరిపి వెలికితీశారు. నెల్లూరు జిల్లాలోని చేజర్ల మండలం పెరుమాళ్లపాడు సమీపంలో పెన్నా నది ఒడ్డున ఇసుక మేటల ధాటికి 80ఏళ్ల కిందట ఊరు రెండు మైళ్లు దూరం లోపలికి జరిగింది. అయితే అక్కడే ఉన్న 200ఏళ్ల నాటి నాగేశ్వరాలయం ఇసుకమేటల్లో కనిపించకుండా పోయింది. దీన్ని వెలికి తీయాలని గ్రామస్తులు అనుకున్నారు. కరోనా లాక్ డౌన్ కారణంగా ఊర్లోకి వచ్చిన స్థానిక యువకులు అధికారుల అనుమతి తీసుకుని తవ్వకాలు మొదలుపెట్టారు. ఆ మేటల కింద పరశురాముడు ప్రతిష్ఠిత నాగేశ్వరస్వామికి వేమన కుటుంబీకులు నిర్మించిన ఆలయం బయటపడింది.