Aug 21, 2020, 10:49 AM IST
పూతలపట్టు పాల డెయిరీలో గ్యాస్ లీకేజీ ఘటనపై జిల్లా కలెక్టర్‌తో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడారు. గ్యాస్ లీకేజీ వల్ల అస్వస్థతకు గురైన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం బండపల్లి సమీపంలోని హట్సన్ పాల డెయిరీలో అమ్మోనియం గ్యాస్ లీకైన ఘటనలో 20 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. బాధితులందరినీ చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం లేదని కలెక్టర్ వెల్లడించారు. ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించారు. డెయిరీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే గ్యాస్ లీకైందా... లేక ప్రమాదవశాత్తు జరిగిందా.. అన్నది తేలాల్సి ఉంది.