Nov 18, 2022, 4:58 PM IST
అమరావతి : నెలలుగా బకాయిపడ్డ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ అమరావతి కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు తుళ్లూరు సీఆర్డిఏ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షను సిఐటియు రాష్ట్ర నాయకులు సిహెచ్ బాబురావు ప్రారంభించారు.
వేతనాల చెల్లింపుతో పాటు జీతాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలంటూ మరికొన్ని డిమాండ్లను కూడా ప్రభుత్వం ముందుచారు కార్మికులు. వేతన బకాయిలు చెల్లించకుంటే ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. అమరావతి పారిశుద్ద్య కార్మికులను 2023 నుండి తొలగించేందుకు వైసిపి ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేసారు.