తాడేపల్లిలో ఉద్రిక్తత... సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి డీఎస్సి అభ్యర్థుల యత్నం

Sep 20, 2021, 4:20 PM IST

అమరావతి: తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంపు కార్యాలయ ముట్టడికి యత్నించారు 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులు. రాష్ట్రంలోని పలు జిల్లా నుంచి వచ్చిన డిఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులు ఒక్కసారిగా క్యాంప్ కార్యాలయ ముట్టడికి యత్నించారు. అయితే వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారి ప్రయత్నాన్ని అడ్డుకుని పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే డిఎస్సి అభ్యర్థులకి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వడంతో పోలీసులు వారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించారు పోలీసులు.