దిశ రేప్, హత్య కేసు: రంగంలోకి తమిళిసై, కేంద్రానికి నివేదిక

By telugu teamFirst Published Dec 3, 2019, 10:55 AM IST
Highlights

దిశ సంఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై రంగంలోకి దిగారు. వెటర్నరీ డాక్టర్ రేప్, హత్య సంఘటనపై కేంద్రానికి నివేదిక పంపించడానికి తమిళిసై సిద్దమవుతున్నారు.కొద్ది రోజుల్లో ఆమె నివేదికను పంపించే అవకాశం ఉంది.

న్యూఢిల్లీ: తీవ్ర సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ రేప్, అత్యాచారం సంఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై రంగంలోకి దిగారు. వెటర్నరీ డాక్టర్ దిశ సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ సంఘటనపై తాను కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు నివేదిక పంపిస్తానని తమిళిసై చెప్పారు. 

బాధితురాలి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించే విషయంపై కూడా తాను ఆలోచన చేస్తున్నట్లు ఆమె సోమవారం చెప్పారు. సంఘటనపై తాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాచారం కోరానని, సమాచారం వచ్చిన తాను నివేదికను రూపొందించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు కొద్ది రోజుల్లో పంపిస్తానని ఆమె చెప్పారు. ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ప్రతినిధితో ఆమె ఫోన్ లో మాట్లాడుతూ ఆ విషయం చెప్పారు. 

Also Read: justice for disha: కృష్ణా నదిలో ‘దిశ’ అస్థికల నిమజ్జనం

వెటర్నరీ డాక్టర్ కుటుంబ సభ్యులను తమిళిసై శనివారంనాడు కలిశారు. న్యాయం జరిగేలా అన్ని విధాలా తాను చర్యలు తీసుకుంటానని ఆమె హామీ ఇచ్చారు. సంఘటనపై ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి, రోజువారీగా విచారణ జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 

దర్యాప్తును పూర్తి చేసి సాధ్యమైనంత త్వరగా కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది. సంఘటన అత్యంత విషాదకరమైందీ దిగ్భ్రాంతికరమైందని, అమ్మాయిల్లో మనోధైర్యం సడలుతోందని ఆమె అన్నారు. 

Also Read: జస్టిస్ ఫర్ దిశ: వెటర్నరీ డాక్టర్ కావడానికి కారణమిదే

click me!