Tamilsai  

(Search results - 9)
 • tamilsai

  Telangana17, Jan 2020, 12:00 PM IST

  మహిళా రైతుని ఆదుకున్న గవర్నర్ తమిళిసై.. సర్వత్రా ప్రశంసలు

  నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం  పెంటకలాన్ గ్రామం భూలక్ష్మీ క్యాంప్ కి చెందిన పేరం సీతారామమ్య భర్త రామిరెడ్డి  చనిపోవడంతో ఆయన పేరిట ఉన్న 4.30 ఎకరాలను విరాసత్ చేయాలని తహసీల్దార్ ని కోరింది. సర్వే నంబర్లలో విస్తీర్ణం పెరిగిందని, సరిచేసే దాకా పాస్ పుస్తకాలు ఇవ్వలేమని, ఏడాది దాకా ఆగాలని తహసీల్దార్ ఆమెతో చెప్పారు.
   

 • tamilisai takes oath

  Telangana3, Dec 2019, 10:55 AM IST

  దిశ రేప్, హత్య కేసు: రంగంలోకి తమిళిసై, కేంద్రానికి నివేదిక

  దిశ సంఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై రంగంలోకి దిగారు. వెటర్నరీ డాక్టర్ రేప్, హత్య సంఘటనపై కేంద్రానికి నివేదిక పంపించడానికి తమిళిసై సిద్దమవుతున్నారు.కొద్ది రోజుల్లో ఆమె నివేదికను పంపించే అవకాశం ఉంది.

 • kcr

  Telangana25, Nov 2019, 2:49 PM IST

  గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో కేసీఆర్ భేటీ

  తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం నాడు తెలంగాణ గవర్నర్  సౌందరరాజన్‌తో భేటీ అయ్యారు.. ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్న నేపథ్యంలో  ఈ భేటీకి ప్రాధాన్యత నెలకొంది.

 • కేసీఆర్‌ను సరిగ్గా లాక్ చేయడానికి తమకు ఇంతకన్నా మంచి సమయం మళ్లీ రాదని బీజేపీ నేతలు భావిస్తున్నారు. తెలంగాణలో పరిస్థితిని ఢిల్లీ స్థాయిలో నిశితంగా గమనిస్తున్నారు. ఇక సరైన సమయంలో సంధించడానికి బ్రహ్మాస్త్రం గవర్నర్ తమిళిసై ఎలాగు ఉన్నారు. ఇప్పటికే ఆర్టీసీ సమ్మె, ఉద్యోగుల మూకుమ్మడి తొలగింపుపై చర్యలు తీసుకోవాల్సిందిగా తెలంగాణ బీజేపీ నేతలు ఇప్పటికే గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రెండు, మూడు రోజులు వేచి చూసి ఈ వ్యవహారంపై తమిళిసై నేరుగా రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  Telangana22, Oct 2019, 5:30 PM IST

  ఇక తండాల్లోకి తమిళిసై: ఇప్పటికే ఆర్టీసీ, కేసీఆర్ కు మరో చిక్కు

  తమిళసై అలా రాజభవన్ కు పరిమితం కాకుండా నేరుగా ప్రజల్లోకి రావడంపై ఇతర పార్టీలు ఆహ్వానిస్తున్నాయి. గవర్నర్ రాకతోనైనా తెలంగాణలో పరిస్థితులు మారతాయని వారు అభిప్రాయపడుతున్నారు. మరి తమిళసై పర్యటనలు ఎలా ఉండబోతాయో అనేది వేచి చూడాలి. 

 • Telangana governor Tamilisai Soundararajan

  Telangana18, Oct 2019, 7:44 AM IST

  RTC Strike: చట్టాల్లో సెల్ప్ డిస్మిస్ ఉందా? ఆరా తీసిన తమిళిసై

  ఆర్టీసీ సమ్మె విషయమై రవాణా శాఖ కార్యదర్శితో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సమీక్షించారు. ఆర్టీసీ సమ్మె విషయమై అసలేం జరుగుతోందని ఆమె రవాణ శాఖ కార్యదర్శిని ప్రశ్నించారు.

 • KCR

  Opinion17, Oct 2019, 7:11 PM IST

  అచ్చం కుముద్ బెన్ జోషీ లాగే తమిళిసై: కేసీఆర్ పక్కలో బల్లెం?

  ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. కెసిఆర్ లాంటి బలమైన నాయకుడికి ఎదురెళ్లి, అదీ ఎన్నికలకు ఇంకో 4 సంవత్సరాల సమయం ఉండగా, అసెంబ్లీలో ప్రతిపక్షమే లేని వేళ ఏ ధైర్యం, అండ చూసుకొని అశ్వత్తామ రెడ్డితోపాటు కార్మికులంతా సమ్మెకు దిగినట్టు? కెసిఆర్ ఉద్యోగులు సెల్ఫ్ డిస్మిస్ అయిపోరని ప్రకటించినా వెరవకుండా ముందుకెలా వెళ్తున్నట్టు? మిగిలిన అన్ని కార్మిక సంఘాలు కూడా కెసిఆర్ ను కాదని తెరాస కు వ్యతిరేకంగా ఎందుకు ఆర్టీసీ సమ్మెకు మద్దతిస్తున్నట్టు? ఎన్టీఆర్ ప్రభుత్వం కూలిపోలేదా అనే వ్యాఖ్యలు ఆర్టీసీ నేతలు ఎందుకు చేస్తున్నట్టు?

 • ఆ విషయాలను పక్కన పెడితే, కేసీఆర్ కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయడానికే శాసనసభకు ముందస్తు ఎన్నికలు జరిగేలా చూసుకున్నారు. లోకసభ ఎన్నికల్లో బిజెపికి కనీసం 60 సీట్లు తక్కువ పడుతాయని, తాను రాష్ట్రంలోని 17 స్థానాల్లో 16 గెలుస్తానని, జగన్ కు, నవీన్ పట్నాయక్, స్టాలిన్ తదితరులకు వచ్చే సీట్లను కలుపుకుంటే దాదాపు 60 సీట్లను కూడగట్టి తాను డిప్యూటీ పిఎం పదవిని అధిష్టించాలని ఆశించారని ఆయన సన్నిహతులు చెబుతారు

  Telangana17, Sep 2019, 6:01 PM IST

  రంగంలోకి తమిళిసై: కేసీఆర్ కు ప్రజా దర్బార్ సవాల్

  తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా నియమింపబడ్డప్పటినుండి తెరాస తరుఫు నుంచి ఏదో ఒక రూపంలో నిరసన ధ్వనులు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రప్రభుత్వ వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకోవడం కోసం ఇలా ఒక యాక్టీవ్ (క్రియాశీలక) పొలిటీషియన్ ని నియమించిందని తెరాస ఆరోపిస్తున్న విషయం మనందరికి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ సీపీఆర్వో జ్వాలా నరసింహారావు ఏకంగా ఒక ఆంగ్ల పత్రికలో ఇలా క్రియాశీలక పొలిటీషియన్ లను రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులు పెట్టేందుకే కేంద్రాలు నియమిస్తాయన్నాడు

 • BjP leaders with Tamilisai

  Telangana15, Sep 2019, 9:38 AM IST

  కేసీఆర్ కు తెలంగాణ విమోచన దినోత్సవ సెగ: తమిళిసైతో బిజెపి నేతల భేటీ

  కేసీఆర్ కు పొగ పెట్టేందుకే తెలంగాణ గవర్నర్ గా తమిళిసై సౌందరరాజన్ ను నియమించారనే మాట వినిపిస్తూ వస్తోంది. అందుకు తగినట్లుగానే ఆమెతో బిజెపి నేతలు క్రమం తప్పకుండా భేటీ అవుతున్నారు. తాజాగా తెలంగాణ విమోచన దినోత్సవం నిప్పును రాజేస్తున్నారు.

 • kcr

  Telangana7, Sep 2019, 10:25 PM IST

  కేసీఆఆర్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు: కొత్తగా ఆరుగురు

  కేసీఆర్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. కొత్త గవర్నర్ తమిళసై సౌందర రాజన్ కొత్త మంత్రులతో రేపు సాయంత్రం 4 గంటలకు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఉద్వాసనలు ఉంటాయా అనే సందేహం తలెత్తుతోంది.