నమ్మకం లేదా.. సీట్లు దక్కలేదా.. ఈ ముగ్గురు పోటీలో ఎందుకు లేరు..?

By sivanagaprasad kodatiFirst Published Nov 1, 2018, 9:02 AM IST
Highlights

టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లు మహా కూటమిగా జట్టు కట్టిన సంగతి తెలిసిందే. సీట్ల సర్దుబాటు విషయంలో నిన్న అర్థరాత్రి వరకు నేతల మధ్య చర్చలు జరిగాయి. 

టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లు మహా కూటమిగా జట్టు కట్టిన సంగతి తెలిసిందే. సీట్ల సర్దుబాటు విషయంలో నిన్న అర్థరాత్రి వరకు నేతల మధ్య చర్చలు జరిగాయి.

ఈ క్రమంలో విశ్వసనీయ సమాచారం మేరకు.. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్, సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డిలు ఎన్నికల్లో పోటీ చేయరని తెలుస్తోంది.

టీఆర్ఎస్‌ను ఓడించి మహాకూటమిని అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని.. కేసీఆర్ అరాచక పాలనను అంతం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు. అయితే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన పక్షంలో కాంగ్రెస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రభుత్వంలో కేబినెట్‌లోకి తీసుకుంటామని హస్తం హామీ ఇచ్చింది.

ఈ ప్రతిపాదనకు రమణ, చాడ, కోదండరామ్‌ సుముఖత వ్యక్తం చేయలేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రజాకూటమిలో  తన తొలి విడత జాబితాను రేపు ప్రకటించే అవకాశం ఉంది. ఇందులో కాంగ్రెస్ నుంచి 50 మంది, టీడీపీ నుంచి ఐదుగురు, టీజేఎస్ నుంచి ముగ్గురు, సీపీఐ నుంచి ఇద్దరికి చోటు లభించే అవకాశం ఉంది.

టీటీడీపీ తన తొలి జాబితాలో ఈ.పెద్దిరెడ్డి (కూకట్‌పల్లి), టీ.వీరేందర్ గౌడ్ (ఉప్పల్), కె.దయాకర్ రెడ్డి(మక్తల్) లేదా సీతా దయాకర్ రెడ్డి (దేవరకద్ర), ఎర్రా శేఖర్ (జడ్చర్ల లేదా మహబూబ్‌నగర్)లను తమ అభ్యర్థులుగా ఫైనల్ చేసే అవకాశం ఉంది.

అలాగే ప్రొ.కోదండరామ్ సారథ్యంలోని తెలంగాణ జన సమితి తన అభ్యర్థులుగా కె.దిలీప్ కుమార్ (మల్కా‌జ్‌గిరి), కె.చందర్ (రామగుండం),  దుబ్బాక విషయంలో ఇద్దరి పేర్లను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇక సీపీఐ నుంచి జి.మల్లేశ్ (బెల్లంపల్లి), రాములు నాయక్ (వైరా)లకు స్థానం లభించనుంది. మహాకూటమి అభ్యర్థులకు ఉమ్మడి గుర్తుగా దేనిని పేర్కొనలేదు.. వీరంతా వారి సొంత పార్టీల గుర్తులతోనే ఎన్నికల్లో పోటీ చేస్తారు. 

ప్రజా కూటమికి బీటలు: సీట్ల సర్దుబాటుపై పీటముడి

కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేయం: కోదండరామ్

తేలని సీట్ల లెక్క: కోదండరామ్‌తో చర్చలకు జానారెడ్డి రెడీ

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహా కూటమికి షాక్: బిజెపి వైపు కోదండరామ్

మహా కూటమిలోకి మందకృష్ణ: 12 సీట్లకు సిపిఐ బేరాలు

మహా కూటమి: 25 సీట్లు టీడీపీ టార్గెట్, అభ్యర్థులు వీరే...

మహా కూటమి యత్నాలు: కోదండరామ్ షరతులివే

టార్గెట్ 2019: మహా కూటమి సీఎం అభ్యర్ధిగా పవన్ కళ్యాణ్

click me!