ఎన్నికల 'సిత్రాలు': షేవ్ చేస్తూ, తినిపిస్తూ, స్నానం చేయిస్తూ....

Published : Nov 01, 2018, 08:00 AM IST
ఎన్నికల 'సిత్రాలు': షేవ్ చేస్తూ, తినిపిస్తూ, స్నానం చేయిస్తూ....

సారాంశం

ప్రజా కూటమి తన అభ్యర్థులను ఇప్పటికీ ప్రకటించలేదు. టీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించడంతో వారంతా ప్రచారంలో మునిగి తేలుతున్నారు. 

హైదరాబాద్‌: ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అభ్యర్థులు చిత్రవిచిత్రమైన పనులు చేస్తున్నారు. ఓటర్ల మద్దతు కోసం ఏ అవకాశాన్ని కూడా వారు వదులుకోవడం లేదు. ప్రజా కూటమి తన అభ్యర్థులను ఇప్పటికీ ప్రకటించలేదు. టీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించడంతో వారంతా ప్రచారంలో మునిగి తేలుతున్నారు. 

రద్దయిన అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి భూపాలపల్లి నియోజకవర్గంలోని ఓ మంగలి షాపులో గడ్డం చేస్తూ కనిపించారు. మరో అభ్యర్థి చింతా ప్రభాకర్ సంగారెడ్డిలోని ఓ ఇంటిలో వంట చేశారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా ఆయన ఆ పనిచేశారు. 

మహబూబ్ నగర్ టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ కుట్టు మిషన్ పై బట్టలు కుట్టారు. కూలీలతో కలిసి భవన నిర్మాణ పనుల్లో పాల్గొన్నారు. బోధన్ అభ్యర్థి షకీల్ అహ్మద్ ఓటర్లకు అన్నం తినిపించారు. 

ఇల్లెందు అభ్యర్థి కోరం కనకయ్య ఓ ఓటరుకు స్నానం చేయించారు. మగ్గుతో అతని తలపై నీళ్లు పోస్తూ ఆయన దర్శనమిచ్చారు. తెలంగాణ శాసనసభలోని 119 సీట్లకు డిసెంబర్ 7వ తేదీన పోలీంగ్ జరుగుతుండగా ఓట్ల లెక్కింపు 11వ తేదీన జరుగుతుంది. 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌