జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటనకు ఉపయోగించిన వాహనాల యజమానులు ఎవరో బయట పెట్టాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని హైద్రాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఎందుకు దాచి పెడుతున్నారో చెప్పాలన్నారు.
హైదరాబాద్: Jubileehills Gang Rape ఘటనకు ఉపయోగించిన వాహనాల యజమానులు ఎవరో బయట పెట్టాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హైద్రాబాద్ సీపీ CV Anand ను కోరారు.
బుధవారంనాడు Hyderabad లో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మే 28వ తేదీన Minor Girl పై గ్యాంగ్ రేప్ జరిగిందని సీవీ ఆనంద్ మీడియా సమావేశంలో చెప్పారన్నారు.Amnesia pub పబ్ నుండి మెర్సిడెజ్ బెంజ్ కారులో బాలికను తీసుకెళ్లిన నిందితులు బేకరీ వద్ద ఈ కారు నుండి ఆమెను దింపి ఇన్పోవా కారులో తీసుకెళ్లారని పోలీసులు చెప్పిన విషయాన్ని Revanth Reddy గుర్తు చేశారు.
undefined
మే 28వ తేదీన ఘటన జరిగితే జూన్ 4వ తేదీన Innova కారును పోలీసులు సీజ్ చేశారన్నారు. ఇన్ని రోజుల పాటు కారు ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు. కారులో ఆధారాలు లేకుండా నిందితులు ప్రయత్నించేందుకు పోలీసులు సహకరించారా అని ఆయన అడిగారు. మైనర్లు వాహనాలు నడిపితే వాహనాల యజమానులపై కేసులు పెట్టాలని మోటార్ వాహనాల చట్టం చెబుతుందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో నిందితులు మైనర్లేనని సీవీ ఆనంద్ చెప్పారన్నారు. ఇన్నోవా కారును కూడా మైనర్లే నడిపారని సీపీ మీడియా సమావేశంలో చెప్పడాన్ని ఆయన గుర్తు చేశారు. మైనర్లే వాహనం నడిపితే ఈ వాహనం ఎవరిదో గుర్తించి వాహన యజమానిపై ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు.
బెంజ్ కారు, ఇన్నోవా వాహనాల యజమానులు ఎవరో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇన్నోవా కారు ప్రభుత్వ వాహనమైతే ఈ వాహనం ఎవరికి అలాట్ చేశారో పోలీసులు చెప్పాలన్నారు. మైనర్ బాలికపై అత్యాచారానికి ఉపయోగించిన వాహనాల విషయంలో మోటార్ వాహనాల చట్టం వర్తించకపోతే 16 ఆఫ్ ఫోక్సో చట్టాన్ని అమలు చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
TRS, MIMకు చెందిన నేతల పిల్లలున్నందున ఈ కేసును నీరు గార్చే ప్రయత్నం చేశారా అని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్, ఎంఐఎంలు మిత్రపక్షాలని చెప్పారు. రేప్, హత్యల్లో కూడా ఈ రెండు పార్టీల మధ్య పొత్తులు కొనసాగుతున్నాయని ఈ ఘటన రుజువు చేసిందని రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. మైనర్ బాలికపై అత్యాచారానికి ఱపయోగించిన రెండు వాహనాల యజమానులు ఎవరో ఇంకా పోలీసులు చెప్పడం లేదని ఆయన అడిగారు. ఇన్నోవా వాహనంపై ప్రభుత్వ వాహనం అని ఉన్న స్టిక్కరును ఎవరు తొలగించారో చెప్పాలన్నారు.
also read:బాధితురాలు నిందితుల్ని గుర్తుపట్టదా... వాళ్లను కాపాడేలా సీపీ మాటలు, ఆ ఎమ్మెల్యే ఎవరు : దాసోజు శ్రవణ్
Excise నిబంధనల మేరకు పబ్ లోకి మైనర్లను అనుమతించొద్దన్నారు. కానీ మైనర్లను పబ్ లోకి అనుమతించిన వారిపై పబ్ యజమానులపై ఎందుకు కేసులు పెట్టలేదో చెప్పాలన్నారు. KCR అధికారంలోకి వచ్చిన తర్వాత 150 పబ్ లకు అనుమతి ఇచ్చిందని చెప్పారు. Hyderabad లో వారం రోజుల్లో మైనర్ బాలికలపై అత్యాచారాలు చోటు చేసుకొన్నాయన్నారు. హైద్రాబాద్ లో గ్యాంగ్ రేప్ లకు పబ్ లు, డ్రగ్స్, గంజాయిలే కారణమని ఆయన చెప్పారు.
ప్రతి విషయంలో స్పందించే హైద్రాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఈ గ్యాంగ్ రేప్ ఘటనపై ఎందుకు స్పందించడం లేదని చెప్పారు. ఈ వరుస ఘటనలతో హైద్రాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిందన్నారు. వరుసగా మైనర్ బాలికలపై రేప్ లు జరుగుతుంటే సీఎం ఎందుకు సమీక్ష చేయడం లేదని ప్రశ్నించారు. శంసాబాద్ ఎయిర్ పోర్టులో నిర్వహించే పబ్ బ్రోతలుహౌస్ గా మారిందని ఆయన ఆరోపించారు.నిబంధనలకు విరుద్దంగా పబ్ లు నిర్వహించే వారిపై దాడులు చేయాలని ఎన్ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.