టెక్కీ సతీష్ హత్యకు కారణమిదే

Published : Sep 05, 2019, 01:41 PM ISTUpdated : Sep 05, 2019, 04:04 PM IST
టెక్కీ సతీష్ హత్యకు కారణమిదే

సారాంశం

టెక్కీ సతీష్ ను అతని స్నేహితుడు హేమంత్ హత్య చేయడానికి కారణాలను పోలీసులు చేధించారు. యువతి విషయమై హేమంత్ సతీష్ ను చంపాడని పోలీసులు నిర్ధారించారు.

హైదరాబాద్: కూకట్‌పల్లిలో టెక్కీ సతీష్ హత్య కేసును పోలీసులు చేధించారు.తన ప్రియురాలును సతీష్ దూరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని హేమంత్ భావించి హత్య  చేసినట్టుగా పోలీసులు నిర్ధారించారు. .గురువారం నాడు మధ్యాహ్నం నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.

కూకట్‌పల్లికి చెందిన టెక్కీ సతీష్‌ను ఈ ఏడాది ఆగష్టు 27వ తేదీ రాత్రి హేమంత్ హత్య చేశాడు. హేమంత్‌ను తన భాగస్వామిగా సతీష్ చేర్చుకొన్నాడు.  హేమంత్ ద్వారా సతీష్ కు పరిచయమైన యువతి కారణంగానే ఈ హత్య జరిగినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

ఆ యువతి  తనకు దూరమయ్యేలా సతీష్ ప్రయత్నిస్తున్నాడని హేమంత్ అనుమానించాడు. ఈ విషయమై అతడిని చంపాలని నిర్ణయం తీసుకొని చంపేసినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. 

ఈ నెల 27వ తేదీన సతీష్ ను మద్యం తీసుకురావాలని హేమంత్ ఫోన్ చేసి పిలిచాడు. మద్యం బాటిల్స్ తీసుకొని సతీష్ హేమంత్ ఇంటికి వెళ్లాడు. మద్యం తాగిన తర్వాత హేమంత్ సతీష్ హత్య చేశాడు.  తొలుత రాడ్‌తో సతీష్ తలపై బాదాడు. ఆ తర్వాత  కత్తితో గొంతు కోసినట్టుగా తెలుస్తోంది.

ఇవాళ మధ్యాహ్నం ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు వివరించే అవకాశం ఉంది. నిందితుడిని కూడ మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.

ఇదిలా ఉంటే తన భర్త  చాలా మంచివాడని సతీస్ భార్య ఇప్పటికే ప్రకటించారు. తన భర్తకు వివాహేతర సంబంధాన్ని అంటగట్టి కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె ఆరోపించిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

హేమంత్ ఒక్కడి పని కాదు: టెక్కీ సతీష్ భార్య ప్రశాంతి

టెక్కీ సతీష్ హత్య: పోలీసుల అదుపులో హేమంత్, కారణమదేనా?

టెక్కీ సతీశ్ హత్య: వీడని చిక్కుముడులు, మరిన్ని ట్విస్టులు

టెక్కీ సతీష్ హత్య కేసులో ట్విస్ట్: అక్రమ సంబంధమే కారణం

కేపీహెచ్‌బీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దారుణహత్య

PREV
click me!

Recommended Stories

Kavitha Kalvakuntla Pressmeet: రేవంత్ రెడ్డి, హరీష్ రావుపై రెచ్చిపోయిన కవిత| Asianet News Telugu
Harish Rao Serious Comments on Revanth Reddy | BRS VS CONGRESS | Politics | Asianet News Telugu