మహిళను దారుణంగా హత్యచేసి.. గుర్తుపట్టకుండా ఉండాలని..

Published : Sep 05, 2019, 10:18 AM ISTUpdated : Sep 05, 2019, 10:22 AM IST
మహిళను దారుణంగా హత్యచేసి.. గుర్తుపట్టకుండా ఉండాలని..

సారాంశం

హైదరాబాద్ బీజాపూర్ వెళ్లే రహదారిలో రంగంపల్లి గేట్ పక్కన ఈ రోజు తెల్లవారు జామున గుర్తు తెలియని మహిళ పూర్తిగా మంటల్లో తగలబడిపోయిన మృతదేహాన్ని స్థానికులు కొందరు గమనించారు. 

వికారాబాద్ జిల్లా పరిగిలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళను దారుణంగా హత్య చేశారు. అనంతరం చనిపోయింది ఎవరూ అన్నది గుర్తుపట్టకుండా ఉండేందుకు పెట్రోల్ పోసి తగలపెట్టారు. పూర్తి వివరాల్లోకి వెళితే.... 

గుర్తు తెలియని మహిళను హత్య చేసి ఆపై నిప్పంటించి పూర్తిగా దుండగులు తగులబెట్టారు. హైదరాబాద్ బీజాపూర్ వెళ్లే రహదారిలో రంగంపల్లి గేట్ పక్కన ఈ రోజు తెల్లవారు జామున గుర్తు తెలియని మహిళ పూర్తిగా మంటల్లో తగలబడిపోయిన మృతదేహాన్ని స్థానికులు కొందరు గమనించారు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని క్లూస్‌ టీమ్, డాగ్ స్క్వాడ్‌ను పిలిపించి పరిశీలించారు. ఇంతకీ ఆ మహిళ ఎవరు..? ఇక్కడే హత్య చేసి తగులబెట్టారా..? లేకపోతే ఎక్కడ నుంచైనా మృతదేహాన్ని తీసుకొచ్చి ఇక్కడ తగులబెట్టారా..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
 

PREV
click me!

Recommended Stories

Air Pollution : హైదరాబాద్ మరో డిల్లీ అవుతోందా..! ఈ ప్రాంతాల్లో మరీ ఇంత కాలుష్యమా..!!
Hyderabad: ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌లోని ఈ ప్రాంతం మ‌రో మాదాపూర్ కావ‌డం ఖాయం