139 మంది రేప్ కేసులో ట్విస్ట్: ప్రదీప్ కు యువతి క్లీన్ చిట్, డాలర్ బాయ్ మీదే...

By telugu teamFirst Published Aug 31, 2020, 12:36 PM IST
Highlights

తనపై 139 మంది అత్యాచారం చేసినట్లు ఆరోపణలు చేసిన యువతి కేసు భారీ మలుపు తీసుకుంది. యువతి మీడియాతో మాట్లాడింది. యాంకర్ ప్రదీప్ కు, నటుడు కృష్ణుడుకు ఆమె క్లీన్ చిట్ ఇచ్చింది.

హైదరాబాద్: తనపై 139 మంది అత్యాచారం చేశారని ఆరోపించిన మిర్యాలగుడా యువతి కేసు భారీ మలుపు తీసుకుంది. బాధితురాలు సోమవారం మీడియా ముందుకు వచ్చింది. తనపై 139 మంది అత్యాచారం చేయలేదని ఆమె చెప్పింది. సెలబ్రిటీల పేర్లను ఫిర్యాదులో డాలర్ బాయ్ బలవంతంగా చేర్పించారని ఆమె చెప్పింది.

డాలర్ బాయ్ ఒత్తిడి వల్లనే యాంకర్ ప్రదీప్ పేరు చేర్చినట్లు తెలిపింది. నటుడు కృష్ణుడుకు కూడా సంబంధం లేదని చెప్పింది. కేసును తప్పు దోవ పట్టించడానికి డాలర్ బాయ్ ప్రయత్నించాడని ఆరోపించింది. లేకపోతే తన కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరించినట్లు తెలిపింది. ఇప్పటికి కూడా తన కుటుంబ సభ్యులను చంపడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పింది.

Also Read: యువతిపై 139 మంది రేప్ కేసు: సెల్ స్విచాప్ చేసి అజ్ఞాతంలోకి డాలర్ బాయ్

డాలర్ బాయ్ తనను చంపడానికి ప్రయత్నించాడని చెప్పింది. తనతో పాటు మరో ఇద్దరు అమ్మాయిలను కూడా డాలర్ బాయ్ ట్రాప్ చేశాడని చెప్పింది. డాలర్ బాయ్ ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడని చెప్పింది. తాను నరకం అనుభవించానని, ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితిని కల్పించారని ఆవేదన వ్యక్తం చేసింది. సంబంధం లేదని చెప్పినా సెలిబ్రిటీల పేర్లను బలవంతంగా చేర్పించారని, సెలబ్రిటీలను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు లాగాలని డాలర్ బాయ్ ప్రయత్నించాడని ఆమె చెప్పింది.

మీడియాతో తనతో బలవంతంగా మాట్లాడించారని, తనను కొట్టి సెలబ్రిటీలతో మాట్లాడించారని బాధితురాలు చెప్పింది. తన ఫొటోలు ఎవరికీ పంపించలేదని, అవి వైరల్ అవుతున్నాయని, తన ఫొటోలు వాడవద్దని, వాడి ఉంటే వాటిని తీసేయాలని ఆమె మీడియాతో చెప్పింది. తన ఫిర్యాదులో కూడా తాను పేరు చెప్పలేదని, దిశ అని మాత్రమే పేర్కొన్నానని ఆమె చెప్పింది. తన వ్యక్తిగత వివరాలు సేకరించి రాస్తున్నారని ఆమె చెప్పింది.

బాధితురాలికి అండగా నిలిచిన వివిధ కుల సంఘాలు, మహిళా సంఘాలు హైదరాబాదులోని సోమాజిగుడా ప్రెస్ క్లబ్ లో బాధితురాలితో మీడియా సమావేశం ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా ఎమ్మార్పీయస్ నేత మందకృష్ణ మాదిగ కూడా మాట్లాడారు. ఈ కేసుతో యాంకర్ ప్రదీప్ మాచిరాజుకు సంబంధం లేదని చెప్పారు. 

ఇటువంటి సంఘటన చూస్తే పూలన్ దేవి గుర్తుకొచ్చందని, పూలన్ దేవీ మీద ఎన్నోసార్లు అఘాయిత్యాలు జరిగాయని, పీడిత కులానకిి చెందిన యువతిపై 139 మంది అత్యాచారం చేశారని తెలిసి షాక్ కు గురయ్యానని ఆయన అన్నారు. 

నిన్న సుమారు రెండు గంటల పాటు బాధితురాలితో మాట్లాడానని ఆయన చెప్పారు. తమ జోలికి అనవసరంగా వస్తే వదిలి పెట్టేది లేదని ఆయన అన్నారు. పెళ్లయిన తర్వాత అమ్మాయి జీవితంలో జరిగిన నాలుగు సంఘటనలను బాదితురాలు వివరించిందని ఆయన చెప్పారు. 139 మందిలో 30 శాతం మంది ఆమెపై దారుణంగా అత్యాచారం చేశారని ఆయన అన్నారు. దాదాపు 40 శాతం మంది సంబంధం లేనివారున్నారని చెప్పారు. 

ఎస్ఎఫ్ఐకి చెందిన మీసాల సుమన్ ఈ అమ్మాయి జీవితంలోకి ఎప్పుడైతే ప్రవేశించాడో అప్పుడు అమ్మాయి బ్లాక్ మెయిల్ కు గురైందని మందకృష్ణ చెప్పారు. డాలర్ బాయ్ కూడా అమ్మాయిపై అత్యాచారం చేశాడని చెప్పారు. డాలర్ బాయ్ ను అదుపులోకి తీసుకుంటే అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పారు.

click me!