Asianet News TeluguAsianet News Telugu

యువతిపై 139 మంది రేప్ కేసు: సెల్ స్విచాప్ చేసి అజ్ఞాతంలోకి డాలర్ బాయ్

తనపై 139 మంది అత్యాచారం చేశారని ఓ యువతి చేసిన ఫిర్యాదు కేసులో డాలర్ బాయ్ కీలకంగా మారాడు. సెల్ ఫోన్ స్విచాఫ్ చేసి డాలర్ బాయ్ అజ్ఞాతంలోకి వెళ్లాడు .అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Miryalaguda girl complaint: Dallar bhai in under ground
Author
Hyderabad, First Published Aug 31, 2020, 9:00 AM IST

హైదరాబాద్: తనపై 9 ఏళ్ల పాటు 139 మంది అత్యాచారం చేశారని మిర్యాలగుడాకు చెందిన యువతి ఆరోపించిన కేసులు సిసీఎస్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో డాలర్ బాయ్ అనే వ్యక్తిపై పోలీసులు ప్రధానంగా దృష్టి పెట్టాడు. అతను సెల్ ఫోన్ స్విచాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అతని కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. 

డాలర్ బాయ్ కార్యాలయంలో స్వాధీనం చేసుకున్న అమ్మాయిల డాక్యుమెంట్లు ఎవరివి అనే విషయంపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. 139 మంది తనపై అత్యాచారం చేశారని యువతి చేసిన ఆరోపణలకు సంబంధించిన కేసులో పోలీసులు మరింత ఆరా తీస్తున్నారు.

also Read: యువతిపై 139 మంది రేప్‌కేసులో ట్విస్ట్: డాలర్ బోయ్ స్వచ్ఛంధ సంస్థ సీజ్

హైదరాబాదులోని సోమాజిగుడాలో గల డాలర్ బాయ్ కార్యాలయం ది గాడ్ పవర్ ఫౌండేషన్ లో సీసీఎస్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయాన్ని సీజ్ చేశారు. పరారీలో ఉన్న డాలర్ బాయ్ కోసం గాలిస్తున్నారు.

తనపై 139 మంది అత్యాచారం చేశారని ఓ యువతి ఇటీవల హైదరాబాదులోని పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాన్ని పంజగుట్ట పోలీసులు సీసీఎస్ పోలీసులకు అప్పగించారు. సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో డాలర్ బాయ్ విషయం వెలుగులోకి వచ్చింది.

Also Read: 139 మంది రేప్ చేశారు: పంజగుట్ట పోలీసులకు మిర్యాలగూడ మహిళ ఫిర్యాదు

యువతి ఫిర్యాదు చేయడానికి ముందు డాలర్ బాయ్ కొంత మందిని బ్లాక్ మెయిల్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అందుకు సంబంధించిన ఆడియో టేప్ లు కూడా లీకయ్యాయి. దీంతో డాలర్ బాయ్ ఆ కేసులో కీలకంగా మారాడు. యువతిని అడ్డం పెట్టుకుని డాలర్ బాయ్ బ్లాక్ మెయిల్ చేశాడనే ఆరోపణలు వస్తున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios