పార్టీకి ఓనర్లు ఉండరు, నేనే ఓనర్ అంటే ఎలా : కేటీఆర్ వార్నింగ్

By Nagaraju penumalaFirst Published Sep 12, 2019, 9:30 AM IST
Highlights

నాలుగు కోట్లమంది తెలంగాణ ప్రజల అస్తిత్వానికి ప్రతీక టీఆర్ఎస్ పార్టీ అని కేటీఆర్ స్పష్టం చేశారు. ఎవరికి వారు నేనే ఓనర్ అంటూ మాట్లాడటం సరికాదన్నారు. తెలంగాణ రాష్ట్రసమితిలో క్రమశిక్షణ రాహిత్యాన్ని ఏమాత్రం సిహించేది లేదని హెచ్చరించారు. ఎంతటి వారైనా ఉపేక్షించబోమని కేటీఆర్ హెచ్చరించారు. 
 

హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీకి ఓనర్లమంటూ చేస్తున్న నేతల వ్యాఖ్యలపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలకు ఓనర్లు ఉండరని స్పష్టం చేశారు. ఆస్తులకు ఓనర్లు ఉంటారే తప్ప అస్తిత్వాలకు ఉండరన్నారు. 

బుధవారం తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రకార్యదర్శులతో కేటీఆర్ సమావేశమయ్యారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. రెండోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారిగా తెలంగాణ భవన్ కు వచ్చిన కేటీఆర్ కు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. 

నాలుగు కోట్లమంది తెలంగాణ ప్రజల అస్తిత్వానికి ప్రతీక టీఆర్ఎస్ పార్టీ అని కేటీఆర్ స్పష్టం చేశారు. ఎవరికి వారు నేనే ఓనర్ అంటూ మాట్లాడటం సరికాదన్నారు. తెలంగాణ రాష్ట్రసమితిలో క్రమశిక్షణ రాహిత్యాన్ని ఏమాత్రం సిహించేది లేదని హెచ్చరించారు. ఎంతటి వారైనా ఉపేక్షించబోమని కేటీఆర్ హెచ్చరించారు. 

క్రమశిక్షణ ఉల్లంఘించి మాట్లాడటం డెంగీ వ్యాధికన్నా ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ అన్ని కోణాల్లో పరిశీలించి మంత్రివర్గ విస్తరణ చేపట్టినట్లు తెలిపారు. దానిపైకొంతమంది నేతలు మీడియాలోప్రకటనలు చేస్తుండటం సరికాదని హితవు పలికారు. 

త్వరలోనే పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకుంటారని తెలిపారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే కార్యకర్తలే వారిని నిలదీయాలని సూచించారు. తానుపార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినా నిలదీయాలని కార్యకర్తలకు సూచించారు.  

సీఎం కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ ద్వారా ఎమ్మెల్యేలకు పదవులు ఇచ్చారని ఇంకా వేల సంఖ్యలో పదవులు ఉన్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ 60 లక్షల కార్యకర్తలతో దేశంలోనే బలమైన పార్టీల్లో ఒకటిగా అవతరించిందని చెప్పుకొచ్చారు. 60లక్షల మంది పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నట్లు తెలిపారు. 

మరికొంతమంది ఎమ్మెల్యేలు ఇంకా సభ్యత్వ నమోదు పుస్తకాలను అందజేయలేదని వారు త్వరగా అందజేయాలని సూచించారు. దసరాకు మెుత్తం 31 జిల్లాలలో పార్టీ కార్యాలయాలను ప్రారంభఇంచాలని ఆదేశించారు. ప్రస్తుతం 22 చోట్ల పార్టీ కార్యాలయాల నిర్మాణాలు జరుగుతున్నాయని మిగిలిన వాటిలో ఒక్కో గది అయినా నిర్మించి వాటిని ప్రారంభించాలని సూచించారు. 

మరోవైపు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి టిక్కెట్లు తామే ఇస్తామని ఇన్ చార్జులుగా ఉన్న కొందరు ప్రధాన కార్యదర్శలు ప్రచారం చేస్తున్నారంటూ మంత్రులు కేటీఆర్ కి ఫిర్యాదు చేశారు. ఇలాంటి ప్రచారాలను సహించేది లేదన్నారు. 

టిక్కెట్లు అధిష్టానమే ఇస్తుందని అయితే ఎమ్మెల్యేల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సన్నద్ధంగా ఉండాలని దిశానర్దేశం చేశారు. ప్రసార మాధ్యమాల్లో కొన్ని అధికార పార్టీకి శత్రువులగా పనిచేస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. 

పార్టీకి నష్టం తెచ్చేందుకు అవి ప్రయత్నిస్తున్నాయని వాటి ఉచ్చులో పడొద్దని సూచించారు. పార్టీ కోసం కష్టపడాలని ఆదేశించారు. కష్టపడిన ప్రతీ కార్యకర్తకు తప్పనిసరిగా పదవులు లభిస్తాయన్నారు. సీనియర్ ఎమ్మెల్యేలకు కార్పొరేషన్లు ఉంటాయన్నారు. ఈ శాసన సభ సమావేశాల్లో కమిటీ చైర్మన్ల నియామకం జరుగుతుందని కేటీఆర్ తెలిపారు.  

ఈ వార్తలు కూడా చదవండి

ముల్లును ముల్లుతోనే..: కేసీఆర్ పై బిజెపి ప్రత్యేక వ్యూహం ఇదే...

కేసీఆర్ కు గులాబీ ఓనర్ల చిక్కు: హరీష్ రావుతో ఈటల రాజేందర్ కు చెక్

మంత్రి ఈటల రాజేందర్ కు షాక్: బిఎసి నుంచి తొలగింపు

ఆ పదవి నేను చేస్తానా: కేసీఆర్‌కి నాయిని నర్సింహారెడ్డి సెగ

ముంచుకొస్తున్న ముప్పు: మంత్రివర్గ విస్తరణపై మారిన కేసీఆర్ ప్లాన్

ఈటలతో నాకు విభేదాలు లేవు: గంగుల

మంత్రి పదవిపై తేల్చేశారా: కేసీఆర్‌తో ఈటల రాజేందర్ భేటీ

కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఉద్వాసన ఎవరికీ

click me!