సెలబ్రిటీలపై బలమైన ఆధారాలు లేవు: టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై ఎక్సైజ్ శాఖ ఛార్జీషీట్

By narsimha lodeFirst Published Sep 20, 2021, 4:49 PM IST
Highlights


టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కోర్టుకు సమర్పించిన ఛార్జీషీట్ లో ఎక్సైజ్ శాఖ కీలక అంశాలను ప్రస్తావించింది. డ్రగ్స్ కేసును కెల్విన్ తప్పుదారి పట్టించేలా వ్యవహరించారని ఎక్సైజ్ శాఖ  ఆరోపించింది.


హైదరాబాద్:  టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కోర్టుకు సమర్పించిన ఛార్జీషీట్ లో ఎక్సైజ్ శాఖ కీలక అంశాలను ప్రస్తావించింది. డ్రగ్స్ కేసును కెల్విన్ తప్పుదారి పట్టించేవిధంగా ఉన్నాయని  ఎక్సైజ్ శాఖ ఆరోపించింది.టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలపై బలమైన ఆధారాలు లేవని ఎక్సైజ్ శాఖ ఛార్జీషీట్ లో పేర్కొంది. సినీ తారలు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు డ్రగ్స్ అమ్మినట్టు కెల్విన్ వాంగూల్మం ఇచ్చినట్టుగా ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. 

also read:టాలీవుడ్‌ డ్రగ్స్ కేసులో బిగ్‌ ట్విస్ట్.. 16 మందికి క్లీన్‌ చీట్‌..

అయితే కెల్విన్ ఇచ్చిన వాంగ్మూలం నమ్మశక్యంగా లేదని కోర్టుకు సమర్పించిన ఛార్జీషీట్ లో తేల్చి చెప్పింది.నిందితుడు కెల్విన్ చెప్పిన విషయాలు ఆధారాలుగా భావించలేమని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్, నటుడు తరుణ్ శాంపిల్స్ లో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని ఫోరెన్సిక్ నివేదిక తెలిపింది.

2017లో టాలీవుడ్ డ్రగ్స్ కేసు నమోదైంది. ఈ కేసును  ఎక్సైజ్ శాఖ విచారించింది. ఎక్సైజ్ శాఖ  నమోదు చేసిన కేసు ఆధారంగా ప్రస్తుతం ఈడీ అధికారులు టాలీవుడ్ కి చెందిన సినీ తారలను విచారిస్తున్నారు. ఈ డ్రగ్స్ కేసులో ఫెమా నిబంధనలను ఉల్లంఘించారని ఈడీ గుర్తించింది. అంతేకాదు సినీతారల బ్యాంకు ఖాతాల ఆధారంగా ఈడీ అధికారులు విచారణ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలోనే ఎక్సైజ్ శాఖ ఈ కేసుతో సినీ నటులకు ఎలాంటి సంబంధం లేదని ఛార్జీషీట్ దాఖలు చేసింది.

కెల్విన్ మంగుళూరులో చదువుకున్నారని ఎక్సైజ్ శాఖ ఛార్జీషీట్ లో పేర్కొంది. ఈ సమయంలోనే అప్పుడే డ్రగ్స్ కు కెల్విన్ అలవాటుపడ్డాడని ఎక్సైజ్ శాఖ తెలిపింది. 2013 నుండి డ్రగ్స్ అమ్మడం మొదలుపెట్టారని చెప్పారు. విదేశాల నుండి డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ దిగుమతి చేసుకొన్నారని ఛార్జీషీట్ లో పేర్కొంది ఎక్సైజ్ శాఖ.కెల్విన్ అతని స్నేహితులు నిశ్చయ్, రవికిరణ్ ప్రమేయం ఉందని ఛార్జీషీట్ లో పేర్కొంది ఎక్సైజ్ శాఖ.

 

click me!