జగన్ పై దాడి... స్పందించిన మంత్రి కేటీఆర్

By ramya neerukondaFirst Published Oct 25, 2018, 4:07 PM IST
Highlights

వైఎస్ జగన్ పై జరిగిన దాడిని తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు.


వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై జరిగిన దాడిని తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు.  ‘‘ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై జరిగిన దాడిని ఖండిస్తున్నాను. బాధ్యుతలను కఠినంగా శిక్షించాలి. జగన్ గారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’’ అంటూ కేటీఆర్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. 

 

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు గారిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. బాధ్యులను కఠినంగా శిక్షించాలి. జగన్ గారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.

— KTR (@KTRTRS)

గురువారం విశాఖపట్నం ఎయిర్‌పోర్టు లాంజ్‌లో జగన్ పై దుండగుడు దాడి చేసిన సంగతి తెలిసిందే.  సెల్ఫీ తీసుకుంటానంటూ వచ్చిన దుండగుడు కోడి పందేలకు ఉపయోగించే కత్తితో జగన్‌పై దాడికి పాల్పడ్డాడు. దీంతో వైఎస్‌ జగన్‌ భుజానికి గాయమైంది. దాడి చేసిన వ్యక్తిని ఎయిర్‌పోర్ట్‌లోని ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న వెయిటర్‌ శ్రీనివాస్‌గా గుర్తించారు. లాంజ్‌లో వెయిట్ చేస్తున్న జగన్‌కు టీ ఇచ్చిన శ్రీనివాస్.. ‘‘సార్ 160 సీట్లు వస్తాయా’’ అంటూ పలకరించాడు. అనంతరం సెల్ఫీ దిగుతానంటూ దాడికి పాల్పడ్డాడు. దాడి జరిగిన వెంటనే దుండగుడిని సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.

more news

జగన్ ఫ్లెక్సీ కట్టాడు, మంచోడు: శ్రీనివాస్ సోదరుడు సుబ్బరాజు

జగన్‌పై వెయిటర్ దాడి: స్పందించిన రెస్టారెంట్ ఓనర్ హర్షవర్దన్

వైఎస్ జగన్‌పై దాడి: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు భార్య భారతి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (వీడియో)

వైఎస్ జగన్ పై కత్తితో దాడి:కుప్పకూలిన తల్లి విజయమ్మ, భార్య భారతి

160 సీట్లు వస్తాయా, సార్! అని అడిగి జగన్ పై దాడి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (ఫోటోలు)

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి

జగన్‌పై దాడి: ఆ కత్తికి విషం పూశారేమో.. రోజా సంచలన వ్యాఖ్యలు

వైఎస్ జగన్ పై కత్తితో దాడి:కుప్పకూలిన తల్లి విజయమ్మ, భార్య భారతి

160 సీట్లు వస్తాయా, సార్! అని అడిగి జగన్ పై దాడి

click me!