నా వాట్సాప్ కాల్స్ కూడా ట్యాప్ చేశారు.. కోదండరాం

Published : Oct 25, 2018, 12:48 PM IST
నా వాట్సాప్ కాల్స్ కూడా ట్యాప్ చేశారు.. కోదండరాం

సారాంశం

 కొన్ని రోజులుగా తనను షాడో టీమ్‌లు వెంబడిస్తున్నాయని చెప్పారు. ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని కొందరు ఇంటెలిజెన్స్ అధికారులు చెప్పారని ఆయన తెలిపారు.

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. తమ ఫోన్లను, ఆఖరికి తన వాట్సాప్ కాల్స్ ని ట్యాప్ చేయిస్తున్నారని టీజీఎస్ అధినేత కోదండరాం ఆరోపించారు. కొన్ని రోజులుగా తనను షాడో టీమ్‌లు వెంబడిస్తున్నాయని చెప్పారు. ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని కొందరు ఇంటెలిజెన్స్ అధికారులు చెప్పారని ఆయన తెలిపారు.

 విపక్ష నాయకుల కార్లు మాత్రమే ఆపి సోదాలు చేయిస్తున్నారని మండిపడ్డారు. చర్చల దశలోనే కూటమి ఉందని...సీట్ల పంపకాలపై స్పష్టత రాలేదని అన్నారు. చంద్రబాబు ట్రాప్‌లో మహాకూటమి పడిందనడం అవాస్తవమని కోదండరాం స్పష్టం చేశారు. గురువారం తెలంగాణ జనసమితి రాష్ట్ర కార్యవర్గం సమావేశమైంది. మేనిఫెస్టో, సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై ప్రధానంగా చర్చించనున్నారు.

PREV
click me!

Recommended Stories

Top 5 Bathukamma Songs: యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్న టాప్ 5 బతుకమ్మ పాటలు ఇవే
Hyderabad : హైదరాబాద్‌లో అంతరిక్షం నుండి కనిపించేంత భారీ చెత్తకొండలా..! ఎక్కడున్నాయో తెలుసా?