ప్రధాని మోడీ వ్యాఖ్యలపై దుమారం: తెలంగాణ బీజేపీ నేతలకు ఇరకాటం

By telugu teamFirst Published Feb 8, 2020, 5:37 PM IST
Highlights

ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణలో దుమారం చెలరేగుతోంది. దీంతో తెలంగాణ బిజెపీ నేతలు ఇరకాటంలో పడ్డారు. తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోడీ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు బిజెపి నేతలను ఆత్మరక్షణలో వేస్తున్నాయి. అవకాశం వస్తే అధికార పార్టీ పై విమర్శలు గుప్పిస్తున్న బీజేపీ నేతలకు మోడీ చేసిన  వ్యాఖ్యలు కొత్త చిక్కులు తెచ్చి పెడుతున్నాయి.మున్సిపల్ ఎన్నికల అనంతరం జరిగిన పరిణామాలపై  టిఆర్ఎస్ పార్టీ వ్యవహరించిన తీరుపై బీజేపీ నేతలు  వెంకయ్యనాయుడు  కు ఫిర్యాదు చేశారు.

 ఇదే సమయంలో ప్రధాని మోడీ లోక్ సభలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని గుర్తు చేస్తూ అప్పుడు జరిగిన ఘటనలను తెరపైకి తేవడంతో టిఆర్ఎస్ నేతలు ఇదే అవకాశంగా బిజెపిపై  మాటల దాడికి దిగారు.

బీజేపీ నేతలు సహకరించిన కారణంగా తెలంగాణ రాష్ట్రం సాధ్యం అయిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని టిఆర్ఎస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించిన విషయాన్ని బీజేపీ నేతలు విస్మరిస్తున్నారని  అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.బిజెపి నేతలకు తెలంగాణపై చిత్తశుద్ధి ఎంతో ప్రధాని వ్యాఖ్యలతో తేలిపోయిందని  బిజెపి ని ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నిస్టున్నారు.

కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న  టిఆర్ఎస్ మోడీ చేసిన వ్యాఖ్యలు తమకు కలిసి వస్తాయని భావిస్తోంది.   బిజెపి నేతలు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని అధికార పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.రాష్ట్ర ఆవిర్భావాన్ని చిన్నచూపు చూసే చేసి మాట్లాడడం ప్రధాని మోడీ కి తగదని హితవు చెబుతున్నారు. 

రాష్ట్ర విభజన కోసం సహకరించిన బిజెపి పార్టీ ఇప్పుడు రాష్ట్ర విభజనను తక్కువ చేసి చూపడం మ ఎంతవరకు సమంజసమని గులాబీ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు

click me!