మైనర్ బాలికపై రేప్: నిందితుడికి జీవితఖైదు విధించిన సంగారెడ్డి కోర్టు

By Nagaraju penumalaFirst Published Dec 3, 2019, 8:00 PM IST
Highlights

దిశపై దారుణానికి ఒడిగట్టిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ యావత్ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి తరుణంలో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నాగయ్యకు జీవిత ఖైదు విధించడం గమనార్హం. 
 

సంగారెడ్డి: మైనర్ బాలికపై అత్యాచారం కేసులో సంగారెడ్డి కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది సంగారెడ్డి కోర్టు. 

వివరాల్లోకి వెళ్తే 2015 జనవరి 8న మెదక్‌ జిల్లా కంగ్టి మండలంలోని గాజులపాడు గ్రామానికి చెందిన పదో తరగతి చదువుతున్న మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన నాగయ్య అత్యాచారానికి ఒడిగట్టాడు. 

కామాంధుడు అఘాయిత్యంతో తీవ్ర రక్తస్రావమైన మైనర్ బాలికను స్థానికులు గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. జరిగిన దారుణంపై తల్లిదండ్రులతో కలిసి మైనర్ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

అప్పటి నుంచి కేసు విచారణ జరుగుతుంది. అయితే బుధవారం ఈ కేసుకు సంబంధించి న్యాయమూర్తి తన తీర్పును వెల్లడించారు. మైనర్ బాలికపై అత్యాచారానికి నాగయ్య పాల్పడ్డాడని తేలడంతో న్యాయస్థానం అతడికి జీవిత ఖైదు విధించింది. 

దిశ రేప్, హత్య కేసు: రంగంలోకి తమిళిసై, కేంద్రానికి నివేదిక

ఇకపోతే మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడు నాగయ్య బాధితురాలకి వరుసకు సోదరుడు కావడం విశేషం. దిశపై రేప్ హత్య ఘటనపై దేశమంతా ఆందోళనతో రగులుతోంది. 

దిశపై దారుణానికి ఒడిగట్టిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ యావత్ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి తరుణంలో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నాగయ్యకు జీవిత ఖైదు విధించడం గమనార్హం. 

justice for disha:ఆ మెుగుడు నాకొద్దు, ఉరితియ్యండి: దిశ హత్య కేసు నిందితుడి భార్య

click me!