సైదాబాద్ మైనర్ బాలికపై రేప్, హత్య: రాజారాం బ్రిడ్జి వద్దకు రాజు ఇలా చేరాడు....

By narsimha lodeFirst Published Sep 16, 2021, 4:04 PM IST
Highlights


 రాజారాం బ్రిడ్జి వద్దకు ఇతర రాష్ట్రాల లారీల్లో రాజు వచ్చినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. రాజారాం బ్రిడ్జికి సమీపంలోని మూడు కి.మీ. దూరంలోనే నిందితుడి నానమ్మ గ్రామం ఉంది. ఈ ప్రాంతంపై రాజుకి పట్టుందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

వరంగల్: రాజారాం బ్రిడ్జి వద్దకు పోలీసులు, స్థానికుల కళ్లుగప్పి సైదాబాద్ మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు వచ్చినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.ఉప్పల్ నుండి నిందితుడు రాజు ఘట్‌కేసర్ వరకు బస్సులో వచ్చాడు. ఆ తర్వాత అతను ఇతర రాష్ట్రాల లారీలో  రాజారాం బ్రిడ్జికి సమీపంలోని హైవే పైకి వచ్చినట్టుగా గుర్తించారు. ఈ హైవేకి మూడు కిలోమీటర్ల దూరంలోనే రాజు  నానమ్మ గ్రామం ఉంది.  ఈ గ్రామానికి సమీపంలోని హైవే పక్కనే ఉన్న రైస్ మిల్లు పక్కనే  రైల్వే ట్రాక్ ఉంది.

also read:రాజును ఆపేందుకు రైల్వే కీమెన్లు, రైతుల విఫలయత్నం... ఆత్మహత్యకు ముందు ఇంత జరిగిందా..?

ఈ రైల్వే ట్రాక్ కు రాత్రి పూట చేరుకొన్నాడని పోలీసులు గుర్తించారు. ఇవాళ ఉదయం రైల్వే ట్రాక్ పై రైల్వే కీమెన్లు రాజును గుర్తించారు. తొలుత సారంగపాణి అనే రైల్వే కీమెన్ రాజును ప్రశ్నిస్తే రాజు సారంగపాణిని బెదిరించాడు. మరో కీ మెన్ కుమార్ కలిసిన తర్వాత సారంగపాణి ఈ విషయాన్ని కుమార్ కు చెప్పాడు. 

ఈ ఇద్దరిని చూసిన రాజు చెట్ల పొదల్లో  దాక్కొన్నాడు. రైల్వే కీ మెన్స్ చెట్ల పొదల్లో  రాళ్లు విసిరారు. అయితే రాజు మాత్రం చెట్ల పొదల నుండి బయటకు రాలేదు. మరో వైపు చెట్ల పొదల నుండి బయటకు వచ్చిన రాజుకి నాలుగు వైపులా ఆరుగురు వ్యక్తులు కన్పించారు. దీంతో తాను  పట్టుకొనే ప్రయత్నం చేస్తారని  రాజు భావించాడు.

ఇద్దరు రైల్వే సిబ్బంది నుండి తప్పించుకొని వెళ్లి పోవచ్చనే భావనతో రాజు చెట్ల పొదల్లో నుండి బయటకు వచ్చాడు. కానీ , చెట్ల పొదల నుండి బయటకు వచ్చిన తర్వాత ఆరుగురిని చూసిన రాజు తప్పించుకొనే మార్గం లేకపోవడంతో రాజు కోణార్క్ ఎక్స్ ప్రెస్ కింద ఆత్మహత్య చేసుకొన్నాడని ప్రత్యక్షసాక్షులు చెప్పారు.

click me!