డ్రగ్స్ కేసులో కీలక నెట్ వర్క్ ను చేధించాం: హైద్రాబాద్‌ సీపీ సీవీ ఆనంద్

By narsimha lode  |  First Published Sep 1, 2022, 12:36 PM IST


హైద్రాబాద్ లో రూ. 9 లక్షల విలువైన  డ్రగ్స్ ను సీజ్ చేశామని సీపీ సీవీ ఆనంద్ చెప్పారు. అంతేకాదు ఇద్దరు అంతరాష్ట్ర డ్రగ్ పెడ్లర్లను కూడా అరెస్ట్ చేశామని హైద్రాబాద్ సీపీ వివరించారు.
 


హైదరాబాద్:డ్రగ్స్ కేసులో పెద్ద నెట్ వర్క్ ను చేధించామని హైద్రాబాద్ సీవీ ఆనంద్ చెప్పారు. నిందితుల నుండి రూ. 9 లక్షల విలువైన డ్రగ్స్ ను సీజ్ చేశామన్నారు. కీలకమైన ఒక్క డ్రగ్ పెడ్లర్ ను అరెస్ట్ చేయాల్సి ఉందని సీపీ తెలిపారు. ఇద్దరు అంతరాష్ట్ర పెడ్లర్లను అరెస్ట్ చేశామన్నారు.

హైద్రాబాద్ లో  డ్రగ్స్  సీజ్ తో పాటు డ్రగ్ పెడ్లర్ల అరెస్ట్ కు సంబంధించిన సమాచారాన్ని హైద్రాబాద్ సీపీ సీవీ ఆనంద్ మీడియాకు వివరించారు. గురువారం నాడు తన కార్యాలయంలో హైద్రాబాద్ సీపీ సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడారు.  మూడు అంతరాష్ట్ర ముఠాలు డార్క్ నెట్ ను ఉపయోగిస్తూ డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నాయని సీవీ ఆనంద్ వివరించారు. క్రిప్టో కరెన్సీ లావాదేవీలతో డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నారని తాము గుర్తించినట్టుగా సీవీ ఆనంద్ తెలిపారు. డ్రగ్స్ ముఠాలో ప్రధాన సూత్రధారి నరేందర్ నారాయణ్ అని సీపీ చెప్పారు.  నారాయణ్ గోవాలో స్థిరపడ్డాడన్నారు. కానీ ఆయన స్వంత రాష్ట్రం హర్యానా అని సీవీ ఆనంద్ తెలిపారు.  ఏడాది కాలంగా డార్క్ వెబ్ సైట్ ద్వారా నారాయణ్  డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టుగా తాము గుర్తించామన్నారు. దేశ వ్యాప్తంగా 450 మంది వినియోగదారులు నారాయణ్ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారని తమ దర్యాప్తులో తేలిందన్నారు.నారాయణ్  నుండి  డ్రగ్స్ కొనుగోలు చేసే 450 మంది వినియోగదారుల్లో తెలంగాణకు చెందిన వారు ఐదుగురు ఉన్నారని సీవీ ఆనంద్ తెలిపారు.

Latest Videos

undefined

also read:హైద్రాబాద్‌లో రూ. 9 లక్షల విలువైన డ్రగ్స్ సీజ్: ముగ్గురు డ్రగ్ పెడ్లర్లు అరెస్ట్

డ్రగ్ పెడ్లర్లు ప్రధాన నగరాల్లో సబ్ ఏజంట్లను నియమించుకుని డ్రగ్స్ ను విక్రయిస్తున్నారన్నారు. హైద్రాబాద్ లో ఆరుగురు డ్రగ్స్ సప్లయ్ లో ఏజంట్లుగా పనిచేస్తున్నారని  సీపీ చెప్పారు. ఉమన్ అలియాస్ ఆషు,అబ్దుల్లా ఖాన్, శర్మ లు ఏజంట్లుగా పనిచేస్తున్నారన్నారు. ఈ ముగ్గురు కూడా క్లాస్ మేట్స్ అని చెప్పారు.. వీరితో పాటు ఇంద్రకుమార్, సందీప్, చరణ్ కుమార్ లు  డ్రగ్ పెడ్లర్లు గా పని చేస్తున్నారన్నారు. వీరి ద్వారా మరో 30 మంది కూడా డ్రగ్స్ కు తీసుకుంటున్నట్టుగా గుర్తించామని  హైద్రాబాద్ సీపీ సీవీ ఆనంద్ చెప్పారు. 

తెలంగాణలో 600 మంది డ్రగ్స్ వాడుతున్న వారిలో ఎక్కువగా  విద్యార్ధులు , సాఫ్ట్ వేర్ ఉద్యోగులే ఉన్నారన్నారు. డ్రగ్స్ వాడుతున్న విద్యార్ధుల వివరాలను ప్రకటించడం లేదన్నారు. ఆ విద్యార్ధులను గోప్యంగా ఉంచుతున్నామని సీపీ తెలిపారు. కొరియర్ల ద్వారా డ్రగ్స్  ను ఇంటికి తెప్పించుకుంటున్నారని సీపీ చెప్పారు. ఇంటికి వచ్చే కొరియర్ కవర్లను పేరేంట్స్ ఓపెన్ చేయాలని సీపీ సూచించారు. 

మరోవైపు సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై నిఘా ఏర్పాటు చేసినట్టుగా సీపీ చెప్పారు. ఇప్పటికే ఇద్దరిపై పీడీ యాక్ట్ అమలు చేశామన్నారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టుల విషయమై ప్రత్యేక విభాగం నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తుందని సీపీ చెప్పారు. ఐదు శిభాగాల్లోని పోలీసులతో ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేశామని సీపీ వివరించారు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల విషయమై 13 మందిపై కేసులు నమోదు చేసినట్టుగా సీపీ చెప్పారు. 


 

click me!