Asianet News TeluguAsianet News Telugu

హైద్రాబాద్‌లో రూ. 9 లక్షల విలువైన డ్రగ్స్ సీజ్: ముగ్గురు డ్రగ్ పెడ్లర్లు అరెస్ట్

హైద్రాబాద్ లో మరోసారి డ్రగ్స్ ను పోలీసులు సీజ్ చేశారు. రూ. 9 లక్షల విలువైన డ్రగ్స్ ను పోలీసులు  స్వాధీనం చేసుకున్నారు. డార్క్ వెబ్ సైట్ ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. 

Three inter-state drug peddlers arrested in Hyderabad
Author
First Published Sep 1, 2022, 10:32 AM IST

హైదరాబాద్:హైద్రాబాద్ లో  గురువారం నాడు  భారీగా డ్రగ్స్ ను పోలీసులు పట్టుకున్నారు. గోవా, రాజస్థాన్, ఢిల్లీకి చెందిన డ్రగ్స్ పెడ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎల్ఎస్‌‌డీ, చరాస్,  ఎండీఎంఏను పోలీసులు సీజ్ చేశారు. వీటి విలువ సుమారు రూ. 9 లక్షలుంటుందని పోలీసులు చెప్పారు. డార్క్ వెబ్ సైట్ ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. హైద్రాబాద్ లో డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో డ్రగ్స్ విక్రయాలు చేస్తూ పట్టుబుడుతున్న కేసులు ఎక్కువగా నమోదౌతున్నాయి. ఈ ఏడాది ఆగస్టు 26న హైద్రాబాద్ కు సమీపంలోని రామచంద్రాపురంలో  డ్రగ్స్ ను విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుండి పోలీసులు 13 గ్రాముల కొకైన్ ను సీజ్ చేశారు. 

ఈ ఏడాది ఆగష్టు 12న హైద్రాబాద్ లో డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీసా గడువు తీరిన తర్వాత కూడా హైద్రాబాద్ లోనే ఉంటూ డ్రగ్స్ విక్రయిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ వ్యాపారాలు చేస్తున్నవారిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ ఏడాది జూలై 12న  సికింద్రాబాద్ లో  16 గ్రాముల కొకైన్ ను పోలీసులు సీజ్ చేశారు. ఈ కేసులో సికింద్రాబాద్ కు చెందిన వినీత్ అగర్వాల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఈ ఏడాది జూలై 4న హైద్రాబాద్ సంజీవరెడ్డి నగర్ లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.హైద్రాబాద్ లో పలు ప్రాంతాల్లో డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న వారితో పాటు డ్రగ్స్ విక్రయిస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పోలీసులతో పాటు ఎక్సైజ్ శాఖాధికారులు కూడా డ్రగ్స్ విక్రయాలు  చేసే వారితో పాటు డ్రగ్స్ కొనుగోలు చేసే వారిపై నిఘాను ఏర్పాటు చేశారు.  తెలంగాణ రాష్ట్రం డ్రగ్స్ ప్రీ రాష్ట్రంగా ఉండాలని తెలంగాణ సీఎం కేసీఆర్  పోలీసులకు సూచించారు. ఈ మేరకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కూడా సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అంతేకాదు ఎక్సైజ్ శాఖ, పోలీసులతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే.
 

Follow Us:
Download App:
  • android
  • ios